Friday 30 December 2011

HAPPY NEWYEAR -- 2012

                   బ్లాగ్ మిత్రులు,నా శ్రేయోభిలాషులకు,అభిమానులకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు

Wednesday 21 December 2011

నవ్వుల రాజులు ఈ ఇంజినీర్లు


     ఐఐటి ఇంజినీర్లు నవ్వుల రాజులయ్యారు
 

ఐఐటీ చదివింది నవ్వులపాలవ్వడానికా..? నవ్వుల రాజులవ్వడానికా...? అదరగొట్టే ప్యాకేజ్‌లతో అందివచ్చిన ఉద్యోగాలను వద్దుపొమ్మన్న ఈ నలుగురు ఐఐటీ ఇంజనీర్లు గిలిగింతలు పెట్టే విజయాన్ని ఎలా సాధించారో చూస్తే, ఉద్యోగమో రామచంద్రా అంటూ చెప్పులరిగేలా తిరిగే యువతీయువకులకు బోలెడు స్ఫూర్తి వస్తుంది...

"అంత కష్టపడి ఐ.ఐ.టి. చదివి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలొస్తే వద్దుపొమ్మంటారా..? మీరేంటి గురూ జీవితాన్ని ఇంత కామెడీగా తీసుకుంటున్నారు..?''

క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలొచ్చిన తోటి విద్యార్థులందరూ ఆ నలుగురు తీసుకున్న నిర్ణయానికి విస్తుపోయారు. వాళ్లు చుట్టూ చేరి నచ్చజెబుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు తప్పిస్తే, కిం చిత్తు రాజీపడటం లేదు ఆ నలుగురు."...ఇక, మేము ఎంత చెప్పినా వినేట్టు లేరు కానీ, ఆఖర్న ఒక మాట చెబుతున్నాం. మీరు కనుక ఈ ఉద్యోగాలను కాదనుకుంటే... భవిష్యత్తులో నవ్వులపాలవ్వడం ఖాయం..'' అంటూ లేచివెళ్లిపోతున్న స్నేహితులను చూస్తూ.. ఆ నలుగురు మళ్లీ పగలబడి నవ్వారు.
"అవును, మేము నవ్వులపాలవ్వాలని డిసైడయ్యాం. మేమే కాదు త్వరలో మిమ్మల్ని కూడా నవ్వులపాలు చేస్తాం. బీ కేర్‌ఫుల్..'' అన్నారు మూకుమ్మడిగా.
"వీళ్లకు పిచ్చి ముదిరిపోయింది'' గొణుక్కుంటూ వెళ్లిపోయారు క్యాంపస్ మిత్రులు.
***

ఏడాది తర్వాత... చిచ్చుబుడ్లు, టపాసులు పేలుతున్నట్లు... టైర్లు పంక్చరైనట్లు, ట్యూబులు తుస్‌మన్నట్లు... బెలూన్లు టప్ టప్‌మని పగిలిపోతున్నట్లు... ఒక్కటే నవ్వులు. చిత్రవిచిత్రమైన శబ్దాలతో కిందపడి దొర్లుతున్న నవ్వులు. ముంబయిలోని ఆ ఆడిటోరియం హ్యూమర్ బాంబ్‌తో ఏ క్షణమైనా పేలిపోవచ్చు అన్నట్లు కడుపుబ్బిపోయింది. చేసిందంతా చేసి వేదిక మీద మౌనంగా నిల్చున్న ఆ నలుగుర్ని చూసి.. ప్రేక్షకులే కాదు, పాత క్యాంపస్ మిత్రులూ ప్రశంసలు కురిపించలేకుండా ఉండలేకపోయారు.

"శభాష్‌రా, ఆ రోజు ఉద్యోగాలు వద్దనుకున్న మిమ్మల్ని చూసి పిచ్చోళ్లు అనుకున్నాం. ఈ రోజు మీ హాస్యాన్ని చూసి మేం పిచ్చెక్కిపోయాం'' అన్నారు ఐఐటి చదువుకున్న రోజుల్లో కలిసి తిరిగిన స్నేహితులు. ఎంతో కష్టపడితే కానీ, ఈ స్థాయికి ఎదగలేదంటున్న ఆ నలుగురే 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్' వ్యవస్థాపకులు. పట్టా చేతికొస్తూనే 'ప్యా కేజ్'లతో కొట్టుకుపోతున్న నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న వాళ్లు.. హ్యూమర్‌ను కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు.

నలుగురిదీ నవ్వుల మార్గమే...
బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితిన్‌గుప్తా, ప్రశాంత్, విపుల్ గోయెల్, తుషార్ ఉపాధ్యాయ చిన్నతనం నుంచే హాస్యం రుచిమరిగారు. హాస్యకవితలు రాయడం, సెటైర్లు కొట్టడం, నాటికల్లో నటించడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో రాటుదేలారు. అభిరుచితో వచ్చిన ఆ నైపుణ్యాలతోనే కెరీర్‌ను మలుచుకోవచ్చనుకున్నారు. ఐఐటీ పూర్తి చేశాక హ్యూమర్‌నే పెట్టుబడిగా పెట్టి ఓ కంపెనీ పెట్టారు. అలా పుట్టిందే 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్'.

"హ్యూమర్ అనేది మనుషులకు మాత్రమే అపురూప వరం. మా కంపెనీ 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్'కు అదే పెట్టుబడి. నవ్వించగలిగే సామర్థ్యమే మాకున్న నైపుణ్యం. అందరూ నడిచేదోవలోనే ఎందుకు నడవాలి..? కొత్త మార్గంలో నడిస్తే వచ్చే నష్టమేమీ లేదు కదా..! అందుకే, మంచి ఉద్యోగాలొచ్చినా వద్దనుకున్నాం. ఈ-జనరేషన్ అనేక ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య బతకాల్సి వస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్‌లకు ఇప్పుడెంత డిమాండ్ ఉందో... రేపు హ్యూమర్‌కు కూడా అంతే డిమాండ్ ఉండబోతోంది.

అవి సక్సెస్ అవాలంటే హ్యూమర్ పండటం చాలా ముఖ్యం. మెట్రోనగరాల్లో కొత్తగా విస్తరిస్తున్న అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో సైతం కామెడీ షోలకు గిరాకీ పెరుగుతోంది. యూనివర్శిటీలు, స్కూల్స్‌లో కూడా కామెడీ షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీరంతా నవ్వగలిగినంత కాలం మా కంపెనీకి ఢోకా లేదు..'' అంటాడు దీని వ్యవస్థాపకులు, చీఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీసర్ (సీఈవో) అయిన నితిన్‌గుప్తా.

బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన 'లవ్ డిసెంబర్' హాస్యనాటికతో పాపులర్ అయ్యారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్‌లో 'హ్యూమర్ రిసోర్సెస్' (హెచ్.ఆర్)గా విపుల్ గోయెల్ చేరాడు. ఈయన కూడా ఐఐటీ బాంబేలోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. కామెడీ షోల నిర్వహణ బాధ్యత అతనిదే. హాస్యనటుడు తుషార్ ఉపాధ్యాయ నవ్వుల కంపెనీ మొత్తానికి వెన్నెముకలాంటి వాడు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన గతంలో- అంతర్ కళాశాలల వేడుకల్లో ఉత్తమ హాస్య నటుడుగా బోలెడన్ని బహుమతులు కొట్టేశాడు. కామెడీషోలలో గంటల తరబడి నిల్చుని నవ్వులు కురిపించే ఉపాధ్యాయ అలసటన్నదే ఎరుగడు. "నేను విసిరే హాస్యోక్తులు, పలికించే హావభావాలకు జనా లు విరగబడి నవ్వుతుంటే... నాకు కడుపు నిండిపోతుంది'' అంటాడాయన.

లాఫింగ్ రీసెర్చ్...
ఇక, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రశాంత్ 'రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్' విభాగాధిపతి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వస్తున్న కామెడీ ట్రెండ్స్‌ను పరిశీలించడం, హాస్యరసంతో వచ్చే కొత్త పుస్తకాలు, సినిమాలు, డీవీడీలు, టీవీ కార్యక్రమాలను అధ్యయనం చేయడం ఈయన పని. వాటి ఆధారంగానే ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందిస్తుంటాడు ప్రశాంత్. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కామెడీ షోలను విజయవంతం చేశారు ఈ నలుగురు ఐఐటీ నవ్వులరాయుళ్లు.

బాలీవుడ్ ప్రముఖులు సుభాష్‌ఘయ్, శేఖర్‌కపూర్‌లు వీళ్ల కామెడీషోలను చూసి.. "ఈ కామెడీ షోలను చూస్తుంటే భారత్‌లో హాస్యానికి మళ్లీ మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. బాలీవుడ్ హాస్య చిత్రాలను తలదన్నేరీతిలో ఇదొక పరిశ్రమగా ఎదగాలని ఆశిస్తున్నాం. హాస్యాన్ని కార్పొరేట్‌స్థాయి తీసుకెళ్లిన ఎంటర్ టైన్‌మెంట్ ఇంజనీర్స్ ఆ పని తప్పక చేస్తుంది'' అంటూ ప్రశంసించారు.

Tuesday 8 November 2011

GREAT MIMICRY ARTIST RAJABABU


తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్‌ రాజబాబు.

మహాకవి శ్రీశ్రీకి తోడల్లుడు రాజబాబు. నరసాపురంలో 1938 అక్టోబర్‌ 20న జన్మించి, మండపేటలో పెరిగి, రాజమండ్రిలో కళాకారుడిగా ఎదిగి, మద్రాస్‌ చేరి సినిమాల్లో హాస్యనటుడిగా స్థిరపడి అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని రాజబాబుగా అలరించారు పుణ్యమూర్తుల అప్పలరాజు.

ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.

1960లో మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ టైమ్‌లో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.

ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.

అడపాదడపా చిన్నచిన్న వేషాలు వేసినా జగపతి వారి అంతస్తులు చిత్రం ఆయన నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు. బిజీ అయిపోయారు. ఒక దశలో రోజుకు రెండు, మూడు షిప్ట్‌లు పనిచేసిన సందర్భాలు కూడా వున్నాయి. హాస్యనటుడిగానే కాక కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందర్నీ నవ్వించి ఆనందపర్చిన రాజబాబు పబ్లిక్‌ ట్రస్ట్‌ ఏర్పరచి ప్రతీ పుట్టినరోజున ఒక ప్రముఖుడ్ని సన్మానించి మూడురోజులపాటు నాటకప్రదర్శనలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే తన నటజీవితానికి ప్రేరణ అయిన అప్పటి హాస్యనటుడు బాలకృష్ణ(అంజి)ని సన్మానించారు.

సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ మిమిక్రీ

పొట్టగొడితే.. పోగాలమే! ...... నినదించిన జగన్ ‘రైతు దీక్ష’



* భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు* మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం.. * మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు నిరసన* జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష* ప్రభం‘జనం’తో కిక్కిరిసిన ఐదో నంబర్ జాతీయ రహదారి* నిప్పులు కక్కుతున్న ఎండను సైతం లెక్కచేయక కాలినడకన వచ్చిన ప్రజలు.. ఉదయం 9 గంటలకే‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో జన హోరు* సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు ‘‘నోటికాడికి ముద్దను తెచ్చే చేతుల్ని నరికే ప్రభుత్వమిది. రైతుల్ని ఇబ్బందిపెట్టినోళ్లంతా ఏమయ్యారు..? ఈ సర్కారూ గాల్లో కలిసేదే.’’‘‘వైఎస్ ఉన్నప్పుడు మద్దతు ధర రూ.వెయ్యి వచ్చేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తోంది.’’‘‘మొన్నటి తుపానుల పరిహారాలకే దిక్కులేదు. బ్యాంకు రుణాల్లో ఇన్సూరెన్స్ కింద కొంత కోతకోసినా.. ఈ సర్కారు హయాంలో మాకు నష్టపరిహారం సొమ్ము వచ్చింది లేదు.’’.... ఇదీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’లో అన్నదాతల ఆవేదన, ఆగ్రహ జ్వాల. వేసవి కాలం.. భానుడు చండ ప్రచండంగా మండిపోతున్నాడు.. అందులోనూ గుంటూరు.. 42 డిగ్రీలతో నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటు ‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో ఇలా రైతు సూరీడు కూడా అంతే స్థాయిలో ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నాడు. తమ బాధలు పట్టని సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడం, వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు తమ ఆవేదన, ఆక్రందనల్ని ఆదివారం ‘రైతు దీక్ష’లో వెళ్లగక్కారు. తమను పట్టించుకోకుండా మిల్లర్లకు ఊతమిస్తూ తమ పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తున్నప్పటికీ.. జగన్ దీక్షకు జనం ప్రభంజనమై పోటెత్తారు. తమకు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి అన్నదాతలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ నినాదాలతో, పోటెత్తిన అశేష జనవాహిని సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు కొనసాగే ఈ దీక్ష 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.రైతు నేతకు నివాళితో దీక్ష ప్రారంభం.. శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్ వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతునేత తికాయత్‌మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సమస్యల గోడు వెళ్ళబోసుకోవటానికి వచ్చిన రైతులతో జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘మీ నాయన బతికుంటే మా బతుకులు బాగుండేవయ్యా’ అంటూ మాచర్లకు చెందిన సింహాద్రి రాములు తన పరిస్థితిని విన్నవించాడు. నాలుగు ఎకరాల్లో పంట వేస్తే అపారనష్టం వాటిల్లిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రూ.600కు కూడా ధాన్యం కొనే నాథుడే లేడని రైతులు తమ ఆవేదనను వివరించారు. మద్దతుగా వేలాదిమంది దీక్షదీక్ష ప్రాంగణంలో జగన్‌కు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష ప్రారంభించారు. దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అడుగడుగునా అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. సమస్యలను, సిద్ధాంతాలను విస్మరించి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి వంగపండు కుమార్తె ఉష ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ చేసిన మిమిక్రీ, గీతాలు ఆహూతులను అలరించాయి. యువత స్వచ్ఛందంగా వాలంటీర్ బాధ్యతలు స్వీకరించి దీక్షకు హాజరైన రైతులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు. 9 గంటల నుంచే జనహోరురైతులు భారీస్థాయిలో దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గుంటూరు, కర్నూలు, చిలకలూరిపేట రోడ్డు(ఎన్‌హెచ్ 5) వాహనాల రద్దీతో కిక్కిరిసింది. ఒకవైపు రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండగానే, మరోవైపు గుంటూరుకు సమీపాననున్న అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, జూనంచుండూరు, వింజనంపాడు, నల్లపాడు తదితర గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన దీక్షాశిబిరానికి వచ్చారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పసిపిల్లల్ని చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం విశేషం. ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతో పాటు శిబిరం వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం దీక్షకు వచ్చిన జనం, జగన్ ప్రభావం, నేతల ప్రసంగాల గురించి చర్చించుకోవడం కనిపించింది. ఎంతమంది జనం వచ్చారు. ఎక్కడెక్కడ్నుంచి వచ్చారు. ఎలా వచ్చారంటూ వివరాల్ని పోలీసులు పదేపదే అడిగి తెలుసుకున్నారు. నేతల ప్రసంగాలప్పుడు ప్రాంగణంలోని యువత జిందాబాద్‌లతో హోరెత్తించారు. తమ అభిమాన నేత జగన్ ప్రసంగం కోసం పదేపదే డిమాండ్ చేశారు. ఆయన్ను కలుసుకుని అభినందించేందుకు, కరచాలనం చేసేందుకు అందరూ ఉత్సాహం చూపడం కనిపించింది. జగన్ చేతిని పెకైత్తి అభివాదం చేసినప్పుడల్లా ప్రాంగణంలో జై జగన్ నినాదాల హోరు మార్మోగింది. జగన్ మెజార్టీపై అభినందనలు....రెండురోజుల కిందటే కడప పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా రికార్డు మెజార్టీని సాధించిన జగన్ విజయోత్సాహాలను కూడా పక్కనపెట్టి రైతు దీక్ష చేయడంపై పలువురు నాయకులు ప్రశంసించారు. జగన్ నిత్య శ్రామికుడిగా రైతు పక్షాన పోరాటాలు చేయడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతోందని కొనియాడారు. జగన్ రికార్డు మెజార్టీతో దేశంలో తెలుగువారి ఆత్మగౌరవం మరొక్కసారి ప్రకటితమైందన్నారు. జగన్ మెజార్టీ గురించి ప్రస్తావించినప్పుడు సభకు హాజరైన వారు కరతాళధ్వనులు చేశారు. ప్రాంగణంలో భారీ విద్యుత్ ప్రభ..రైతు దీక్షా వేదిక ప్రాంగణంలో 98 అడుగుల భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ప్రభ ప్రాంగణానికి నూతన శోభను తీసుకొచ్చింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి అనే రైతు వెయ్యి బల్బులతో ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలాగే దీక్షా వేదిక ప్రాంగణంలో 20 వరకు బెలూన్లను ఎగురవేశారు.


Thursday 3 November 2011

EXCLUSIVE NANDAMURI BALAKRISHNA GARI GETUP IN SREE RAMARAJYAM

                                       SRI BALAKRISHNA SREE RAMA
                                    SREEKANTH IN LAKSHMANA GET UP

AKKINENI NAGARJUNA GARI CHILDHOOD RARE PHOTO

                                                                          sri  AKKINENI NAGARJUNA                                                                            CHILDHOOD RARE PHOTO       

Monday 17 October 2011

ధ్వన్యనుకరణ చక్రవర్తి

" చతుషష్టి కళల్లో స్వర వంచన లేదా అనుకరణ కూడా ఒకటి. మన పురాణాల్లో ఇదొక ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. మహాభారతంలోని కీచక వధ ఘట్టంలో కీచకుణ్ణి తప్పుదారి పట్టించడానికి భీముడు సైరంధ్రి ( ద్రౌపది ) గొంతుతో మాట్లాడుతాడు. రామాయణంలో అహల్య శాపం ఘట్టంలో గౌతమ మహర్షిని వంచించడానికి ఇంద్రుడు కోడిలాగ కూస్తాడు. మాయలేడి రూపంలో మారీచుడు సీతను నమ్మించడానికి రాముడి గొంతుతో 'హా లక్ష్మణా' అని అరుస్తాడు " అని మిమిక్రీ పుట్టుపూర్వోత్తరాల గురించి వివరిస్తారు ధ్వన్యనుకరణ చక్రవర్తి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు.

" సంగీతానికి, నృత్యానికి, చిత్రలేఖనానికి, నటనకు ఇలా అన్నిటికీ పాఠ్యప్రణాళికలున్నాయి.... ఒక్క అనుకరణ కళకు తప్ప. ఆ కళకు వేణుమాధవ్ గారే సిసలైన సిలబస్ " అని కితాబిచ్చారు ప్రముఖ నటులు స్వర్గీయ చిత్తూరు వి. నాగయ్య గారు.

Monday 10 October 2011

Mimicry course (PSTU)




Potti Sreeramulu Telugu University (PSTU)


Evening Courses:

Postgraduate Diploma in Theatre Arts
Postgraduate Diploma in Travel and Tourism (Self Finance Course)
Postgraduate Diploma in Indian Management and Personality Development (Self Finance Course)
Postgraduate Diploma in Linguistics and Telugu Language Teaching
Postgraduate Diploma in Jyotirvastu – Modern Architecture
Diploma in Light Music
Diploma in Harikatha
Diploma in Yakshaganam
Diploma in Mimicry
Diploma in Padya Natakam
Diploma in Jyotisham
Certificate in Jyotisham

బంధువులే రాబంధులై చిదిమేసిన చిన్నారి. ..వైష్ణవి స్మృతిలో.. మితృడు మిమిక్రీ రమేష్(hmtv) రాసి గానం చేసిన

నాట్స్ తెలుగు సంబరాలు


న్యూజెర్సీ: ‘నాట్స్’ వేడుకల వేదికపై వినోదం వేయి విధాల వెల్లివిరియనుంది. వైవిద్య కళా ప్రదర్శనల వివర్ణకాంతి విరజిల్లనుంది. వేనవేల ప్రేక్షకుల కరతాళ ధ్వనుల కోలాహలం కుండపోతగా కురియనుంది. వేదిక ప్రాంగణం ప్రవాసాంధ్రుల పదఘట్టాలతో ప్రతిధ్వనించనుంది. అసంఖ్యాక అతిథులు, ఆహూతుల రాకతో అడుగడుగునా తెలుగు సంస్కృతి ఫరిడవిల్లనుంది. మొత్తంగా వినూత్న కార్యక్రమాల కలబోతగా ‘నాట్స్’ సంబరాల్లో సందడి మిన్నంటనుంది.
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) జులై 1, 2, 3 తేదీల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలదే పెద్దపీట. ఇందుకోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిమిత్తం 450 మంది కళాకారులు అహరహం శ్రమిస్తున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, పెన్సిల్వేనియాకు చెందిన నృత్య దర్శకుల బృందాలు వీరితో సాధన చేయిస్తున్నాయి.
ఈ వేడుకల్లో సినీతారలదే స్టార్ అట్రాక్షన్. వీరు ప్రవాసాభిమానులను అలరించడానికి కదం కదపడానికీ, హుషారుగా చిందేయడానికీ సిద్ధపడుతున్నారు. అలాగే కొంతమంది చిత్ర ప్రముఖులు వేడుకలో పాలు పంచుకుంటారు. యువ కథానాయకుడు రామ్‌చరణ్ తేజ, నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రియమైన కథానాయిక ప్రియమణి, మత్తుకళ్ళ మధుశాలినీ, గులాబీ ట్యూటీ సాక్షి గులాటీ, ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు, కామెడీ హీరో సునీల్, సంగీత దర్శకుడు తమన్, క్యారెక్టర్‌నటులు కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి సహా పలువురు వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు.
కార్యక్రమం తొలిరోజు సినీతారలతో ప్రత్యేకంగా ఎన్నారైలకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆవేళ కోటాశ్రీనివాసరావు కామెడీ, ఫ్లూట్ నాగరాజు ప్రదర్శన, మిమిక్రీ రమేష్ ప్రోగామ్ సెషన్స్ నిర్వహిస్తారు. అలాగే మత్తెక్కించే మధుగీతాల గాయనీమణి ఎల్‌ఆర్. ఈశ్వరి, ఘంటశాల రత్నకుమార్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇక ఆ మరుసటి రెండు రోజుల్లో టాలీవుడ్ కమెడీయన్ల కామెడీ షో, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు నృత్య ప్రదర్శన, హీరో కృష్ణుడితో పాటు సునీల్ ప్రత్యేక ప్రదర్శనలు, గజల్ శ్రీనివాస్ గీతాలు, రెండో రోజు మధ్యాహ్నం భోజన సమయంలో ప్రియమణి, రామ్‌చరణ్‌తేజతో ‘మీట్ అండ్ గ్రీట్’, హీరోయిన్ మధుశాలినీ ప్రత్యేక నృత్యగీతాలు ఉంటాయి

Wednesday 5 October 2011

Johnny Lever...Comedian and Mimicry Artist


johnny lever Johnny Lever | Wallpaper | Biography | Images | 
photo


JohnRao Janumala famously known as Johny Lever ( born 7 January 1950, in Prakasam, Andhra Pradesh) is an Indian film actor and comedian. He was born to Prakash Rao Janumala and Karunamma Janumala and brought up in Mumbai. He started his career in 1984 and has acted in over 350 Bollywood films. He has received 13 Filmfare awards nominations in Best Comedian Category and has won the award twice.

Monday 3 October 2011

మిమిక్రీ ... మిమిక్రీ ..

                         



                               ఇది ఓ ఊరిలో జరిగిన సన్నివేశం 
                                 ఆంధ్రప్రభ లో ప్రచురితం.....

     


 అనుకరించడమనే విధానం ఈనాటికిది కాదు. సృష్టి జరిగినప్పటి నుండీ... సృష్టిలో ఎక్కడో ఒకచోట ఓ జీవి మరో జీవిని అనుకరించడం జరుగుతూనే వుంది.
ఆత్మాభిమానంతో, అభిమానంతో తన కృషి వివరించాలే తప్ప అహంభావం... అహంకారం పనికి రాదు.
'విద్యా వినయేన శోభతే!' సాపేక్ష సిద్ధాం తాన్ని రూపకల్పన చేసిన ఐన్‌స్టీన్‌ వంటి మహానుభావుడే... 'నాకు తెలిసింది విజ్ఞాన మనే సముద్రంలోని నీటి బిందువులో వెయ్యోవంతు మాత్రమే'నని సవినయంగా అన్నాడు. అనుకున్నారు వాళ్లంతా.
ఇంతలో మాధవ్‌ మళ్లిd మైక్‌ ముందుకు వచి చెప్పడం ప్రారంభించాడు.
''మిమిక్రీ కళకు అక్షరమాలను నేనే రచించాను. అనుక్రమణికను కూడా సృష్టించాను. ఎలా మిమిక్రీ ప్రదర్శితమవ్వాలో నిర్వచించాను...'' ఇలా ఆయన ఉపన్యాసం సాగిపోతూనే వుంది.
ఇంతలో జనం మధ్యలోంచి మళ్లిd కేకలు..
''మిమిక్రీ చూపించండి... మిమిక్రీ కావాలి...''
ఇక ఏమనుకున్నాడో మాధవ్‌ ఉపన్యాసం ఆపేసి ప్రదర్శన ప్రారంభించాడు.
''ముందుగా పక్షల కిలకిలా రావాలను అనుకరిస్తాను. సూర్యోదయం సమయంలో వాతావరణం ఇలా వుంటుంది...'' అంటూ....
మైక్‌ ముందు చేయి అడ్డంగా పెట్టుకొని నోటిని మైక్‌ దగ్గరపెట్టి చిత్రమైన ధ్వనులు చేయడం ప్రారంభించాడు.
ఉషోదయానికి చిహ్నంగా చల్లని మలయమారుతం వీస్తున్న చప్పుడు... పక్షుల కిలకిలా రావాలు...
పాలకోసం తల్లి ఆవుల దగ్గరకు పరుగులు తీసే లేగదూడల 'అంబా' ధ్వనులు!
నిజంగానే అంతరాత్రి పూట అందరికీ ఉషోదయాన్ని సాక్షాత్కరింపచేశాడు మాధవ్‌.
రకరకాల పశు పక్ష్యాదుల కంఠధ్వనిని అనుకరించి అవి అక్కడ ఉన్నాయనే భ్రమ కలిగించాడు.
అనంతరం ''ఇప్పుడు సినిమా నటులను అనుకరి స్తాను. ముఖ్యంగా అమరులైన మహా నటీనటులను, గాయకులను, గాయనీ మణులను వారి గొంతులను అనుకరిస్తాను...'' అంటూ ప్రారంభించాడు.
అలనాటి మహానటులు వివిధ సినిమాలలో చెప్పిన డైలాగులు వింటుంటే.. వారే పునర్జన్మ పొంది ఎదుటికి వచ్చి మాట్లాడుతూ మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారా అనిపించింది.
నటీమణుల గాత్రం సైతం అందరినీ అలరించింది. గాయకులు, గాయనీమణుల గొంతుతో మనోహరమైన మధురమైన గీతాల పల్లవులు పాడి వినిపించాడు మాధవ్‌.
జనంలోంచి కేరింతలు... కరతాళధ్వనులు... ఆనందాతి రేకంతో పరవళ్లు త్రొక్కాయి.
ఇంతలో... సభలోంచి ఎక్కడో ఓ కుక్క అరుపు వినిపించింది.
ఎవరూ గమనించలేదు. గానీ ఆ అరుపు విని నిజంగానే ఎన్నో కుక్కలు ఆ సభవైపు వచ్చి మొరగ నారంభించాయి. దాంతో సభకు అంతరాయం కలిగింది.
ప్రిన్సిపాల్‌ సైగ చేయడం ఆలస్యం... అటెండర్లు వాటి వెనకబడి తరమడానికి ప్రయత్నించారు.
అయినా అవి మొరగడం ఆపలేదు. ఉన్నచోట నుంచి కదలడం లేదు.
సభంతా అసహనంగా తయారైంది. వేదిక మీద వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.
నేనుండ బట్టలేక మాధవ్‌ గారితో అన్నాను ''మీరు ఆ కుక్కల అరుపుల్ని అనుకరించి వాటిని ఆపు చేయించలేరా?'' అని.
ఆయనా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఇంతలో సభలోంచి మళ్లిd ఓ కుక్క అరుపు వినిపించింది.
అంతే! కుక్కలన్నీ అరుపులు ఆపేసి తోకలు ఆడించుకుంటూ నిలబడ్డాయి.
''ఎవరూ? కుక్కలా అరిచిన ఆ వ్యక్తి ఎవరు?'' మాధవ్‌గట్టిగా అడిగాడు.
సభలోంచి సమాధానం రాలేదు.
మరోసారి ఇంకొక మాడ్యు లేషన్‌లో మూడో కుక్క అరుపు వినిపించింది.
కుక్కలన్ని నెమ్మదిగా కూర్చో వడం ప్రారంభించాయి.
వేదికమీద ఉన్న మా అందరికీ మతి పోయింది.
అప్పటికే మొహం మాడిపోయిన మాధవ్‌ ''కుక్క అరుపులు అరిచిన ఆ వ్యక్తి ఎవరు?'' అంటూ ఉక్రోషంగా గొంతు చించుకున్నాడు.
''నేనే స్వామీ!'' అంటూ ఆడియన్స్‌ మధ్యలోనించి ఓ కుర్రవాడు లేచి నిలబడ్డాడు.
నిక్కరు షర్ట్‌.. భుజంపై ఓ తువ్వాలు... చేతిలో ములుగర్ర. గొడ్ల కాపరీలా ఉన్నాడు.
ముందు వరసల్లోని వి.ఐ.పి.లు వెనకకు తిరిగి చూచారు.
''వాడా... ఎల్లమంద అండీ... మన ఎంకటి పాలేరు కుర్రాడు'' అంటూ ఆ ఊరి సర్పంచ్‌ ఆ కుర్రవాడెవరో ఇట్టే చెప్పేశాడు.
మళ్లిd ఆయనే అన్నాడు ''ఒరేయ్‌! ఎల్లమందా! వాటిని వెనక్కి పంపించెయ్యరా'' అని.
వాడు చేయి అడ్డంపెట్టుకొని మళ్లిd ఓ కుక్క అరుపు అరిచాడు.
అంతే...అవి తోకలూపుకుంటూ దూరంగా వెళ్లి పోసాగాయి.
''అతనికి ఇంకా ఏమయినా వచ్చా?'' వివరాలకోసం మాధవ్‌ అడిగాడు.
''ఆ సచ్చినాడు.. మా గేదెల దగ్గరకొచ్చి ఏదో కూత కూశాడు. అవి పాలివ్వడం మానేశాయ్‌. వాడి కింత అన్నం పెడితే అది తిని మరో కూత కూశాడు వాడు. అవి పాలివ్వడం మొదలు పెట్టాయి'' అంటూ
ఆడియన్స్‌ లోంచి ఒక్కొక్కరూ లేచి వాడితో తమ అనుభవాలను వివరిస్తున్నారు.
''రాత్రిపూట వీధిలో పోయే కుక్కల్ని మొరిగిస్తాడు... వాటిని లేపుతాడు... ఆడిస్తాడు.
వాడు గేదెల్ని కాయడు. ఒక చెట్టుకింద కూర్చుంటాడు. రకరకాల అరుపుల్తో వాటిని తన చుట్టూ తోకాడించుకుంటూ తిరిగేలా చూస్తాడు.
మొన్నీ మధ్యనే వీడు ఎక్కడి నుండో ఆడకోయిలల్ని రప్పించాడు. నెమలుల్ని తన కూతలతో తెప్పించాడు''
సభలోని వారు వాడు చేసిన చేష్టలన్నీ అనుభవాలుగా చెబుతున్నారు.
అవన్నీ వినగానే మాకు వాడి గొప్పతనమేమిటో అర్థమైంది.
మాకంటే మాధవ్‌కు బాగా అర్థమైంది. అందుకే మాధవ్‌ మాట్లాడడం మొదలు పెట్టాడు.
''ఈ సృష్టిలో విచిత్రమేమంటే.. మానవుడు మాత్రమే ఇతర మానవుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, సమస్త జీవ రాశుల్ని అనుకరిస్తాడు. కానీ ఏ జంతువూ మరో జంతువును అనుకరించదు. తన జాతికి చెందిన జంతువు అరుపు విన్నాకనే అది స్పందిస్తుంది. ఇంతకు ముందు నేను వినిపించిన ఎన్నో జంతువుల అరుపులు మిమ్మల్ని అలరించాయే గానీ వాటిని ఆకర్షించలేక పోయాయి.
ఎల్లమంద వినిపించిన అరుపులతో కుక్కలు తిరిగి వెళ్ళి పోయాయి.
అంటే ఎల్లమంద అరిచింది తమ జాతి జంతువుల అరుపులేనని గుర్తించాయి''
కొంచెం మంచినీళ్లు త్రాగి మళ్లిd మాధవ్‌ మొదలుపెట్టాడు.
''సాధారణంగా మగ కోయిల కూస్తుంది. దాని పాట విని ఆడకోయిల వస్తుంది. మగ కోయిలలంత సహజంగా అతడు అరవగలిగాడు కనుకనే ఆడకోయిల వచ్చింది. అలాగే నెమలికూడా? అంటే... అతను చేసిన 'ధ్వన్యనుకరణ' ఎంత సహజంగా ఉందంటే ఆ జంతువులు కూడా అతని అరుపులు విని మోస పోయాయి. హాట్స్‌ ఆఫ్‌ టు హిజ్‌ మిమిక్రీ ఆర్ట్‌! అతనే నిజమైన కళాకారుడు. అతన్ని సన్మానించక పోతే ఈ సభకు అర్థమూ లేదు.. మిమిక్రీ కళకు పరమార్థమూ లేదు. కనుక మీరు నన్ను సన్మానిస్తే... అతన్ని నేను సన్మానిస్తాను! ఎల్లమందా! వేదిక మీదకు రా!'' అంటూ మాధవ్‌ అభ్యర్థించాడు.
అతను వచ్చేటట్లు కనిపించలేదు.
మాధవ్‌ కృతనిశ్చయంగా అన్నాడు... నావైపు చూచి... ''నేను ఎల్లమందను సన్మానించాలి! మాస్టారూ! ప్లీజ్‌..మీరే అతన్ని వేదిక వద్దకు తీసుకురావాలి?'' అంటూ అభ్యర్థించాడు.
నేను అతన్ని తీసుకువచ్చేందుకు వేదిక దిగడం ప్రారంభించడంతో ఏమనుకున్నాడో ఎల్లమందే మెల్లగా స్టేజీ వైపు రావడం ప్రారంభించాడు.
ఇంతలో మిమిక్రీ మాధవ్‌ మొదలుపెట్టిన కరతాళ ధ్వనులతో బాటు సభలోని వారి చప్పట్లు కూడా లయగా మ్రోగడం ప్రారంభించాయి.

Wednesday 28 September 2011

Voice Dubbing & Mimicry




Voice Dubbing & Mimicry
                                Category Suggested By : NEERAJ MEHRA                                                

                             Mimicry is an age-old art. The first mimicry artist might have been a caveman, who copied animal voices to keep them away. In Ramayana, when Rama chased Maricha  who was in the guise of the golden deer, Maricha shouted to attract Lakshmana in imitation of Rama's voice. In Mahabharata, Bhima used this art to entice and eliminate the villain Keechaka. Mimicry artiste should specialise in the imitation of voices.
                 It is broadly of two kinds: 
  • imitation of the manner of people's speaking; 
  • and reproduction of mannerisms, gestures, characteristics and idiosyncrasies of the concerned persons.

NATS POSTER 2011 JULY 1-3


Telugu Samabaralu in New Jersey by NATS on 2nd July


North America Telugu Society (NATS) is organizing the Telugu Sambaralu at New Jersey on 2nd and 3rd July at New Jersey. Sri Sri Sri China Jeeyar Swamiji will inaugurate this two days Sambaralu. Inaugural dance program "Telugu Thoranam" produced by Ghazal Srinivas and choreographed by well known dance gurus from New Jersey will be presented.

Tuesday 27 September 2011

SRI RAJU SRIVSTHAV STORY IN SAAKSHI

    

                                                నవ్వించడం ఏమన్నా నవ్వులాటా...


టిఆర్‌పిలు జారిపోతున్న రోజులవి. కొత్త చానెల్స్‌ను నిలబెట్టాలంటే కొత్త ప్రోగ్రామ్‌లు కావాలి. కొన్నేళ్ల క్రితం కొత్తగా మొదలైన ‘స్టార్ వన్’ చానెల్ అలాంటి కార్యక్రమం ఒకటి ప్లాన్ చేసింది. హాస్యం కరువైపోతున్న ఈ రోజుల్లో హాస్యం చూపిస్తే బాగుంటుందని- ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ ప్లాన్ చేసింది. దేశంలోని మిమిక్రీ ఆర్టిస్టులు ఒకరి వెంట ఒకరుగా వచ్చి హాస్యం ప్రదర్శించడం ఆ కార్యక్రమం ఉద్దేశ్యం. శేఖర్ సుమన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ జడ్జీలు. ఈ ప్రోగ్రామ్ ఓ మోస్తరుగా సక్సెస్ అయినా చాలు అనుకుంది యాజమాన్యం. కాని అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా సూపర్ డూపర్ హిట్ అయ్యి కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించి స్టార్ వన్ చానెల్‌ని తారాపథంలోకి తీసుకెళ్లింది. అందుకు కారణమైన ఏకైక వ్యక్తి- రాజూ శ్రీవాస్తవ్.

The Diary of LEKHA GUMMADI - 8 ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 8

ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 8
The Diary of LEKHA GUMMADI - 8


"నేనేమైనా మణులడిగానా, మాన్యాలడిగానా.. ఒకే ఒక మిరపకాయ బజ్జీ అడిగాను'' అంటూ సీనియర్ నటుడు కృష్ణ వాయిస్ ను అనుకరిస్తూ చేసిన కాసెట్.. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఆ డైలాగులు ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తుంటాయి. అదేదో నా మెమొరీ పవర్ అనుకుంటే అంతకంటే జోక్ ఇంకోటి ఉండదు. గంటక్రితం తిన్న కూరే గుర్తుండదు నాకు. అవును, అవి గుర్తున్నాయంటే, ఖచ్చితంగా మిమిక్రీ ఆర్టిస్ట్ గొప్పతనమే. అందులో ఇంకా చాలామంది నటుల గొంతులు ఉన్నాయి. ఎవరికి వారిదే excellent.. వాళ్ళే స్వయంగా మాట్లాడుతున్నంత సహజంగా ఉంటుంది. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో గానీ.. హాట్సాఫ్ ! అతనే కాదు, టాలెంట్ ఉన్న ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కీ నేను రుణపడిఉంటాను. ఈ మాటగానీ ఆ కళాకారులు వింటే, నేను వాళ్ళకి నిజంగానే బాకీపడ్డట్టు వచ్చి డబ్బులడగ్గలరు!

తొలి భారత మిమిక్రీ కళాకారిణి

                                    తొలి భారత మిమిక్రీ కళాకారిణి
                     ఒక వ్యక్తి ఒక కళలో నైపుణ్యం సాధిస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరే పలు కళల్లో ప్రజ్ఞ కనబరిస్తే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడతాం. అలా పలు కళల్లో ప్రజ్ఞ కనబరుస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి, యాంకర్‌, లైవ్‌ పెర్‌ఫార్మర్‌, ఆర్టిస్ట్‌ కోఆర్డినేటర్‌, షో అరేంజర్‌, రైటర్‌ ఆషాసింగ్‌ మన దేశపు మెుట్టమెుదటి మహిళా మిమిక్రీ కళాకారిణిగా గణతిెకక్కారు. ఆషా నాగపూర్‌ వాసి.
   

aashaa  దాదాపు 20ఏళ్ళ కిందట మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్‌ షోలు ఇస్తూ నలుగురి దృష్టినీ ఆకర్షించారామె. అప్పటి వరకు మగవారు మాత్రమే మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని ఆషా పలు స్టేజ్‌ షోలలో ఒకనాటి ప్రముఖ నటీమణులు మీనాకుమారి, ఆషాపరేఖ్‌, షర్మిలాటాగూర్‌, శ్రీదేవి, మాధురీదీక్షిత్‌, కరిష్మాకపూర్‌ వంటి తారల గొంతును అచ్చుగుద్దినట్టు పలికించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకునేవారు.

సోమయ్య మిమి'క్రీడ’ ఆదివారం ఆంధ్రప్రభ

                              సోమయ్య మిమి'క్రీడ’

   Sun, 27 Sep 2009, IST
మిమిక్రీ అనగానే అందరికీ గుర్తు వచ్చేది హీరోలూ, రాజకీయనాయకుల అనుకరణ, ఎక్కడైనా కనిపించేది వినిపించేది ఇదే. కానీ ఇందుకు భిన్నంగా ఓ పేద యువకుడు పక్షులూ, ప్రకృతిలో ఉండే శబ్దాలను మిమిక్రీ ద్వారా అనుకరిస్తూ ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. పాఠశాలలు, సమావేశాల్లో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, అందరి అభిమానాన్ని పొందుతూ, అచ్చం బాబూమోహన్‌ మాదిరిగా కనిపించే ఈ యువకుడే సోమయ్య.

Friday 5 August 2011

FUNNY PUNCH

                                        అరె మావా ...ఆ మిమిక్రీ రమేష్ గాడు
                                    తెగ రెచ్చిపోతున్నాడు గాని వాడి కంటే
                                  మనం విరగదీయాలి  ...రెడీ 1 ,2 ,3 ..........
                                        అరె .. మావా మైకు విరిగింది ....

FUNNY PIC

  
                                                           ఎప్పుడూ ....ఆ ఫేసుబుక్కు తప్ప
                                                              మరొక ధ్యాస లేదా మీకు
                                                            నెల రోజులైంది అన్నం మానేసి .....
                                                              రండి భోజనం చేద్దురు గాని .........

JUST FOR FUNNY

                                            వస్తాడు ...నా రాజు ..ఈ రోజు

Tuesday 26 July 2011

SMILE PLEASE

                      ఇదిగో  ...మిమ్మల్నే ,అలా గొర్రెల్లా వెంటపడి రాకండి
                             కాస్త కోళ్ళ లా ఆలోచిస్తూ నా వెంటరండి
                                సమజ్ అయిందా లేదా ...?