Monday 17 October 2011

ధ్వన్యనుకరణ చక్రవర్తి

" చతుషష్టి కళల్లో స్వర వంచన లేదా అనుకరణ కూడా ఒకటి. మన పురాణాల్లో ఇదొక ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. మహాభారతంలోని కీచక వధ ఘట్టంలో కీచకుణ్ణి తప్పుదారి పట్టించడానికి భీముడు సైరంధ్రి ( ద్రౌపది ) గొంతుతో మాట్లాడుతాడు. రామాయణంలో అహల్య శాపం ఘట్టంలో గౌతమ మహర్షిని వంచించడానికి ఇంద్రుడు కోడిలాగ కూస్తాడు. మాయలేడి రూపంలో మారీచుడు సీతను నమ్మించడానికి రాముడి గొంతుతో 'హా లక్ష్మణా' అని అరుస్తాడు " అని మిమిక్రీ పుట్టుపూర్వోత్తరాల గురించి వివరిస్తారు ధ్వన్యనుకరణ చక్రవర్తి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు.

" సంగీతానికి, నృత్యానికి, చిత్రలేఖనానికి, నటనకు ఇలా అన్నిటికీ పాఠ్యప్రణాళికలున్నాయి.... ఒక్క అనుకరణ కళకు తప్ప. ఆ కళకు వేణుమాధవ్ గారే సిసలైన సిలబస్ " అని కితాబిచ్చారు ప్రముఖ నటులు స్వర్గీయ చిత్తూరు వి. నాగయ్య గారు.

Monday 10 October 2011

Mimicry course (PSTU)




Potti Sreeramulu Telugu University (PSTU)


Evening Courses:

Postgraduate Diploma in Theatre Arts
Postgraduate Diploma in Travel and Tourism (Self Finance Course)
Postgraduate Diploma in Indian Management and Personality Development (Self Finance Course)
Postgraduate Diploma in Linguistics and Telugu Language Teaching
Postgraduate Diploma in Jyotirvastu – Modern Architecture
Diploma in Light Music
Diploma in Harikatha
Diploma in Yakshaganam
Diploma in Mimicry
Diploma in Padya Natakam
Diploma in Jyotisham
Certificate in Jyotisham

బంధువులే రాబంధులై చిదిమేసిన చిన్నారి. ..వైష్ణవి స్మృతిలో.. మితృడు మిమిక్రీ రమేష్(hmtv) రాసి గానం చేసిన

నాట్స్ తెలుగు సంబరాలు


న్యూజెర్సీ: ‘నాట్స్’ వేడుకల వేదికపై వినోదం వేయి విధాల వెల్లివిరియనుంది. వైవిద్య కళా ప్రదర్శనల వివర్ణకాంతి విరజిల్లనుంది. వేనవేల ప్రేక్షకుల కరతాళ ధ్వనుల కోలాహలం కుండపోతగా కురియనుంది. వేదిక ప్రాంగణం ప్రవాసాంధ్రుల పదఘట్టాలతో ప్రతిధ్వనించనుంది. అసంఖ్యాక అతిథులు, ఆహూతుల రాకతో అడుగడుగునా తెలుగు సంస్కృతి ఫరిడవిల్లనుంది. మొత్తంగా వినూత్న కార్యక్రమాల కలబోతగా ‘నాట్స్’ సంబరాల్లో సందడి మిన్నంటనుంది.
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) జులై 1, 2, 3 తేదీల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలదే పెద్దపీట. ఇందుకోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిమిత్తం 450 మంది కళాకారులు అహరహం శ్రమిస్తున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, పెన్సిల్వేనియాకు చెందిన నృత్య దర్శకుల బృందాలు వీరితో సాధన చేయిస్తున్నాయి.
ఈ వేడుకల్లో సినీతారలదే స్టార్ అట్రాక్షన్. వీరు ప్రవాసాభిమానులను అలరించడానికి కదం కదపడానికీ, హుషారుగా చిందేయడానికీ సిద్ధపడుతున్నారు. అలాగే కొంతమంది చిత్ర ప్రముఖులు వేడుకలో పాలు పంచుకుంటారు. యువ కథానాయకుడు రామ్‌చరణ్ తేజ, నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రియమైన కథానాయిక ప్రియమణి, మత్తుకళ్ళ మధుశాలినీ, గులాబీ ట్యూటీ సాక్షి గులాటీ, ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు, కామెడీ హీరో సునీల్, సంగీత దర్శకుడు తమన్, క్యారెక్టర్‌నటులు కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి సహా పలువురు వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు.
కార్యక్రమం తొలిరోజు సినీతారలతో ప్రత్యేకంగా ఎన్నారైలకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆవేళ కోటాశ్రీనివాసరావు కామెడీ, ఫ్లూట్ నాగరాజు ప్రదర్శన, మిమిక్రీ రమేష్ ప్రోగామ్ సెషన్స్ నిర్వహిస్తారు. అలాగే మత్తెక్కించే మధుగీతాల గాయనీమణి ఎల్‌ఆర్. ఈశ్వరి, ఘంటశాల రత్నకుమార్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇక ఆ మరుసటి రెండు రోజుల్లో టాలీవుడ్ కమెడీయన్ల కామెడీ షో, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు నృత్య ప్రదర్శన, హీరో కృష్ణుడితో పాటు సునీల్ ప్రత్యేక ప్రదర్శనలు, గజల్ శ్రీనివాస్ గీతాలు, రెండో రోజు మధ్యాహ్నం భోజన సమయంలో ప్రియమణి, రామ్‌చరణ్‌తేజతో ‘మీట్ అండ్ గ్రీట్’, హీరోయిన్ మధుశాలినీ ప్రత్యేక నృత్యగీతాలు ఉంటాయి

Wednesday 5 October 2011

Johnny Lever...Comedian and Mimicry Artist


johnny lever Johnny Lever | Wallpaper | Biography | Images | 
photo


JohnRao Janumala famously known as Johny Lever ( born 7 January 1950, in Prakasam, Andhra Pradesh) is an Indian film actor and comedian. He was born to Prakash Rao Janumala and Karunamma Janumala and brought up in Mumbai. He started his career in 1984 and has acted in over 350 Bollywood films. He has received 13 Filmfare awards nominations in Best Comedian Category and has won the award twice.

Monday 3 October 2011

మిమిక్రీ ... మిమిక్రీ ..

                         



                               ఇది ఓ ఊరిలో జరిగిన సన్నివేశం 
                                 ఆంధ్రప్రభ లో ప్రచురితం.....

     


 అనుకరించడమనే విధానం ఈనాటికిది కాదు. సృష్టి జరిగినప్పటి నుండీ... సృష్టిలో ఎక్కడో ఒకచోట ఓ జీవి మరో జీవిని అనుకరించడం జరుగుతూనే వుంది.
ఆత్మాభిమానంతో, అభిమానంతో తన కృషి వివరించాలే తప్ప అహంభావం... అహంకారం పనికి రాదు.
'విద్యా వినయేన శోభతే!' సాపేక్ష సిద్ధాం తాన్ని రూపకల్పన చేసిన ఐన్‌స్టీన్‌ వంటి మహానుభావుడే... 'నాకు తెలిసింది విజ్ఞాన మనే సముద్రంలోని నీటి బిందువులో వెయ్యోవంతు మాత్రమే'నని సవినయంగా అన్నాడు. అనుకున్నారు వాళ్లంతా.
ఇంతలో మాధవ్‌ మళ్లిd మైక్‌ ముందుకు వచి చెప్పడం ప్రారంభించాడు.
''మిమిక్రీ కళకు అక్షరమాలను నేనే రచించాను. అనుక్రమణికను కూడా సృష్టించాను. ఎలా మిమిక్రీ ప్రదర్శితమవ్వాలో నిర్వచించాను...'' ఇలా ఆయన ఉపన్యాసం సాగిపోతూనే వుంది.
ఇంతలో జనం మధ్యలోంచి మళ్లిd కేకలు..
''మిమిక్రీ చూపించండి... మిమిక్రీ కావాలి...''
ఇక ఏమనుకున్నాడో మాధవ్‌ ఉపన్యాసం ఆపేసి ప్రదర్శన ప్రారంభించాడు.
''ముందుగా పక్షల కిలకిలా రావాలను అనుకరిస్తాను. సూర్యోదయం సమయంలో వాతావరణం ఇలా వుంటుంది...'' అంటూ....
మైక్‌ ముందు చేయి అడ్డంగా పెట్టుకొని నోటిని మైక్‌ దగ్గరపెట్టి చిత్రమైన ధ్వనులు చేయడం ప్రారంభించాడు.
ఉషోదయానికి చిహ్నంగా చల్లని మలయమారుతం వీస్తున్న చప్పుడు... పక్షుల కిలకిలా రావాలు...
పాలకోసం తల్లి ఆవుల దగ్గరకు పరుగులు తీసే లేగదూడల 'అంబా' ధ్వనులు!
నిజంగానే అంతరాత్రి పూట అందరికీ ఉషోదయాన్ని సాక్షాత్కరింపచేశాడు మాధవ్‌.
రకరకాల పశు పక్ష్యాదుల కంఠధ్వనిని అనుకరించి అవి అక్కడ ఉన్నాయనే భ్రమ కలిగించాడు.
అనంతరం ''ఇప్పుడు సినిమా నటులను అనుకరి స్తాను. ముఖ్యంగా అమరులైన మహా నటీనటులను, గాయకులను, గాయనీ మణులను వారి గొంతులను అనుకరిస్తాను...'' అంటూ ప్రారంభించాడు.
అలనాటి మహానటులు వివిధ సినిమాలలో చెప్పిన డైలాగులు వింటుంటే.. వారే పునర్జన్మ పొంది ఎదుటికి వచ్చి మాట్లాడుతూ మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారా అనిపించింది.
నటీమణుల గాత్రం సైతం అందరినీ అలరించింది. గాయకులు, గాయనీమణుల గొంతుతో మనోహరమైన మధురమైన గీతాల పల్లవులు పాడి వినిపించాడు మాధవ్‌.
జనంలోంచి కేరింతలు... కరతాళధ్వనులు... ఆనందాతి రేకంతో పరవళ్లు త్రొక్కాయి.
ఇంతలో... సభలోంచి ఎక్కడో ఓ కుక్క అరుపు వినిపించింది.
ఎవరూ గమనించలేదు. గానీ ఆ అరుపు విని నిజంగానే ఎన్నో కుక్కలు ఆ సభవైపు వచ్చి మొరగ నారంభించాయి. దాంతో సభకు అంతరాయం కలిగింది.
ప్రిన్సిపాల్‌ సైగ చేయడం ఆలస్యం... అటెండర్లు వాటి వెనకబడి తరమడానికి ప్రయత్నించారు.
అయినా అవి మొరగడం ఆపలేదు. ఉన్నచోట నుంచి కదలడం లేదు.
సభంతా అసహనంగా తయారైంది. వేదిక మీద వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.
నేనుండ బట్టలేక మాధవ్‌ గారితో అన్నాను ''మీరు ఆ కుక్కల అరుపుల్ని అనుకరించి వాటిని ఆపు చేయించలేరా?'' అని.
ఆయనా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఇంతలో సభలోంచి మళ్లిd ఓ కుక్క అరుపు వినిపించింది.
అంతే! కుక్కలన్నీ అరుపులు ఆపేసి తోకలు ఆడించుకుంటూ నిలబడ్డాయి.
''ఎవరూ? కుక్కలా అరిచిన ఆ వ్యక్తి ఎవరు?'' మాధవ్‌గట్టిగా అడిగాడు.
సభలోంచి సమాధానం రాలేదు.
మరోసారి ఇంకొక మాడ్యు లేషన్‌లో మూడో కుక్క అరుపు వినిపించింది.
కుక్కలన్ని నెమ్మదిగా కూర్చో వడం ప్రారంభించాయి.
వేదికమీద ఉన్న మా అందరికీ మతి పోయింది.
అప్పటికే మొహం మాడిపోయిన మాధవ్‌ ''కుక్క అరుపులు అరిచిన ఆ వ్యక్తి ఎవరు?'' అంటూ ఉక్రోషంగా గొంతు చించుకున్నాడు.
''నేనే స్వామీ!'' అంటూ ఆడియన్స్‌ మధ్యలోనించి ఓ కుర్రవాడు లేచి నిలబడ్డాడు.
నిక్కరు షర్ట్‌.. భుజంపై ఓ తువ్వాలు... చేతిలో ములుగర్ర. గొడ్ల కాపరీలా ఉన్నాడు.
ముందు వరసల్లోని వి.ఐ.పి.లు వెనకకు తిరిగి చూచారు.
''వాడా... ఎల్లమంద అండీ... మన ఎంకటి పాలేరు కుర్రాడు'' అంటూ ఆ ఊరి సర్పంచ్‌ ఆ కుర్రవాడెవరో ఇట్టే చెప్పేశాడు.
మళ్లిd ఆయనే అన్నాడు ''ఒరేయ్‌! ఎల్లమందా! వాటిని వెనక్కి పంపించెయ్యరా'' అని.
వాడు చేయి అడ్డంపెట్టుకొని మళ్లిd ఓ కుక్క అరుపు అరిచాడు.
అంతే...అవి తోకలూపుకుంటూ దూరంగా వెళ్లి పోసాగాయి.
''అతనికి ఇంకా ఏమయినా వచ్చా?'' వివరాలకోసం మాధవ్‌ అడిగాడు.
''ఆ సచ్చినాడు.. మా గేదెల దగ్గరకొచ్చి ఏదో కూత కూశాడు. అవి పాలివ్వడం మానేశాయ్‌. వాడి కింత అన్నం పెడితే అది తిని మరో కూత కూశాడు వాడు. అవి పాలివ్వడం మొదలు పెట్టాయి'' అంటూ
ఆడియన్స్‌ లోంచి ఒక్కొక్కరూ లేచి వాడితో తమ అనుభవాలను వివరిస్తున్నారు.
''రాత్రిపూట వీధిలో పోయే కుక్కల్ని మొరిగిస్తాడు... వాటిని లేపుతాడు... ఆడిస్తాడు.
వాడు గేదెల్ని కాయడు. ఒక చెట్టుకింద కూర్చుంటాడు. రకరకాల అరుపుల్తో వాటిని తన చుట్టూ తోకాడించుకుంటూ తిరిగేలా చూస్తాడు.
మొన్నీ మధ్యనే వీడు ఎక్కడి నుండో ఆడకోయిలల్ని రప్పించాడు. నెమలుల్ని తన కూతలతో తెప్పించాడు''
సభలోని వారు వాడు చేసిన చేష్టలన్నీ అనుభవాలుగా చెబుతున్నారు.
అవన్నీ వినగానే మాకు వాడి గొప్పతనమేమిటో అర్థమైంది.
మాకంటే మాధవ్‌కు బాగా అర్థమైంది. అందుకే మాధవ్‌ మాట్లాడడం మొదలు పెట్టాడు.
''ఈ సృష్టిలో విచిత్రమేమంటే.. మానవుడు మాత్రమే ఇతర మానవుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, సమస్త జీవ రాశుల్ని అనుకరిస్తాడు. కానీ ఏ జంతువూ మరో జంతువును అనుకరించదు. తన జాతికి చెందిన జంతువు అరుపు విన్నాకనే అది స్పందిస్తుంది. ఇంతకు ముందు నేను వినిపించిన ఎన్నో జంతువుల అరుపులు మిమ్మల్ని అలరించాయే గానీ వాటిని ఆకర్షించలేక పోయాయి.
ఎల్లమంద వినిపించిన అరుపులతో కుక్కలు తిరిగి వెళ్ళి పోయాయి.
అంటే ఎల్లమంద అరిచింది తమ జాతి జంతువుల అరుపులేనని గుర్తించాయి''
కొంచెం మంచినీళ్లు త్రాగి మళ్లిd మాధవ్‌ మొదలుపెట్టాడు.
''సాధారణంగా మగ కోయిల కూస్తుంది. దాని పాట విని ఆడకోయిల వస్తుంది. మగ కోయిలలంత సహజంగా అతడు అరవగలిగాడు కనుకనే ఆడకోయిల వచ్చింది. అలాగే నెమలికూడా? అంటే... అతను చేసిన 'ధ్వన్యనుకరణ' ఎంత సహజంగా ఉందంటే ఆ జంతువులు కూడా అతని అరుపులు విని మోస పోయాయి. హాట్స్‌ ఆఫ్‌ టు హిజ్‌ మిమిక్రీ ఆర్ట్‌! అతనే నిజమైన కళాకారుడు. అతన్ని సన్మానించక పోతే ఈ సభకు అర్థమూ లేదు.. మిమిక్రీ కళకు పరమార్థమూ లేదు. కనుక మీరు నన్ను సన్మానిస్తే... అతన్ని నేను సన్మానిస్తాను! ఎల్లమందా! వేదిక మీదకు రా!'' అంటూ మాధవ్‌ అభ్యర్థించాడు.
అతను వచ్చేటట్లు కనిపించలేదు.
మాధవ్‌ కృతనిశ్చయంగా అన్నాడు... నావైపు చూచి... ''నేను ఎల్లమందను సన్మానించాలి! మాస్టారూ! ప్లీజ్‌..మీరే అతన్ని వేదిక వద్దకు తీసుకురావాలి?'' అంటూ అభ్యర్థించాడు.
నేను అతన్ని తీసుకువచ్చేందుకు వేదిక దిగడం ప్రారంభించడంతో ఏమనుకున్నాడో ఎల్లమందే మెల్లగా స్టేజీ వైపు రావడం ప్రారంభించాడు.
ఇంతలో మిమిక్రీ మాధవ్‌ మొదలుపెట్టిన కరతాళ ధ్వనులతో బాటు సభలోని వారి చప్పట్లు కూడా లయగా మ్రోగడం ప్రారంభించాయి.