Friday, 30 December 2011
Tuesday, 27 December 2011
Wednesday, 21 December 2011
నవ్వుల రాజులు ఈ ఇంజినీర్లు
ఐఐటి ఇంజినీర్లు నవ్వుల
రాజులయ్యారు
ఐఐటీ చదివింది నవ్వులపాలవ్వడానికా..? నవ్వుల రాజులవ్వడానికా...? అదరగొట్టే ప్యాకేజ్‌లతో అందివచ్చిన ఉద్యోగాలను వద్దుపొమ్మన్న ఈ నలుగురు ఐఐటీ ఇంజనీర్లు గిలిగింతలు పెట్టే విజయాన్ని ఎలా సాధించారో చూస్తే, ఉద్యోగమో రామచంద్రా అంటూ చెప్పులరిగేలా తిరిగే యువతీయువకులకు బోలెడు స్ఫూర్తి వస్తుంది...
"అంత కష్టపడి ఐ.ఐ.టి. చదివి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలొస్తే వద్దుపొమ్మంటారా..? మీరేంటి గురూ జీవితాన్ని ఇంత కామెడీగా తీసుకుంటున్నారు..?''
క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలొచ్చిన తోటి విద్యార్థులందరూ ఆ నలుగురు తీసుకున్న నిర్ణయానికి విస్తుపోయారు. వాళ్లు చుట్టూ చేరి నచ్చజెబుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు తప్పిస్తే, కిం చిత్తు రాజీపడటం లేదు ఆ నలుగురు."...ఇక, మేము ఎంత చెప్పినా వినేట్టు లేరు కానీ, ఆఖర్న ఒక మాట చెబుతున్నాం. మీరు కనుక ఈ ఉద్యోగాలను కాదనుకుంటే... భవిష్యత్తులో నవ్వులపాలవ్వడం ఖాయం..'' అంటూ లేచివెళ్లిపోతున్న స్నేహితులను చూస్తూ.. ఆ నలుగురు మళ్లీ పగలబడి నవ్వారు.
"అవును, మేము నవ్వులపాలవ్వాలని డిసైడయ్యాం. మేమే కాదు త్వరలో మిమ్మల్ని కూడా నవ్వులపాలు చేస్తాం. బీ కేర్‌ఫుల్..'' అన్నారు మూకుమ్మడిగా.
"వీళ్లకు పిచ్చి ముదిరిపోయింది'' గొణుక్కుంటూ వెళ్లిపోయారు క్యాంపస్ మిత్రులు.
***
"శభాష్‌రా, ఆ రోజు ఉద్యోగాలు వద్దనుకున్న మిమ్మల్ని చూసి పిచ్చోళ్లు అనుకున్నాం. ఈ రోజు మీ హాస్యాన్ని చూసి మేం పిచ్చెక్కిపోయాం'' అన్నారు ఐఐటి చదువుకున్న రోజుల్లో కలిసి తిరిగిన స్నేహితులు. ఎంతో కష్టపడితే కానీ, ఈ స్థాయికి ఎదగలేదంటున్న ఆ నలుగురే 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్' వ్యవస్థాపకులు. పట్టా చేతికొస్తూనే 'ప్యా కేజ్'లతో కొట్టుకుపోతున్న నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న వాళ్లు.. హ్యూమర్‌ను కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు.
నలుగురిదీ నవ్వుల మార్గమే...
బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితిన్‌గుప్తా, ప్రశాంత్, విపుల్ గోయెల్, తుషార్ ఉపాధ్యాయ చిన్నతనం నుంచే హాస్యం రుచిమరిగారు. హాస్యకవితలు రాయడం, సెటైర్లు కొట్టడం, నాటికల్లో నటించడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో రాటుదేలారు. అభిరుచితో వచ్చిన ఆ నైపుణ్యాలతోనే కెరీర్‌ను మలుచుకోవచ్చనుకున్నారు. ఐఐటీ పూర్తి చేశాక హ్యూమర్‌నే పెట్టుబడిగా పెట్టి ఓ కంపెనీ పెట్టారు. అలా పుట్టిందే 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్'.
"హ్యూమర్ అనేది మనుషులకు మాత్రమే అపురూప వరం. మా కంపెనీ 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్'కు అదే పెట్టుబడి. నవ్వించగలిగే సామర్థ్యమే మాకున్న నైపుణ్యం. అందరూ నడిచేదోవలోనే ఎందుకు నడవాలి..? కొత్త మార్గంలో నడిస్తే వచ్చే నష్టమేమీ లేదు కదా..! అందుకే, మంచి ఉద్యోగాలొచ్చినా వద్దనుకున్నాం. ఈ-జనరేషన్ అనేక ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య బతకాల్సి వస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్‌లకు ఇప్పుడెంత డిమాండ్ ఉందో... రేపు హ్యూమర్‌కు కూడా అంతే డిమాండ్ ఉండబోతోంది.
అవి సక్సెస్ అవాలంటే హ్యూమర్ పండటం చాలా ముఖ్యం. మెట్రోనగరాల్లో కొత్తగా విస్తరిస్తున్న అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో సైతం కామెడీ షోలకు గిరాకీ పెరుగుతోంది. యూనివర్శిటీలు, స్కూల్స్‌లో కూడా కామెడీ షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీరంతా నవ్వగలిగినంత కాలం మా కంపెనీకి ఢోకా లేదు..'' అంటాడు దీని వ్యవస్థాపకులు, చీఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీసర్ (సీఈవో) అయిన నితిన్‌గుప్తా.
బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన 'లవ్ డిసెంబర్' హాస్యనాటికతో పాపులర్ అయ్యారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్‌లో 'హ్యూమర్ రిసోర్సెస్' (హెచ్.ఆర్)గా విపుల్ గోయెల్ చేరాడు. ఈయన కూడా ఐఐటీ బాంబేలోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. కామెడీ షోల నిర్వహణ బాధ్యత అతనిదే. హాస్యనటుడు తుషార్ ఉపాధ్యాయ నవ్వుల కంపెనీ మొత్తానికి వెన్నెముకలాంటి వాడు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన గతంలో- అంతర్ కళాశాలల వేడుకల్లో ఉత్తమ హాస్య నటుడుగా బోలెడన్ని బహుమతులు కొట్టేశాడు. కామెడీషోలలో గంటల తరబడి నిల్చుని నవ్వులు కురిపించే ఉపాధ్యాయ అలసటన్నదే ఎరుగడు. "నేను విసిరే హాస్యోక్తులు, పలికించే హావభావాలకు జనా లు విరగబడి నవ్వుతుంటే... నాకు కడుపు నిండిపోతుంది'' అంటాడాయన.
లాఫింగ్ రీసెర్చ్...
బాలీవుడ్ ప్రముఖులు సుభాష్‌ఘయ్, శేఖర్‌కపూర్‌లు వీళ్ల కామెడీషోలను చూసి.. "ఈ కామెడీ షోలను చూస్తుంటే భారత్‌లో హాస్యానికి మళ్లీ మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. బాలీవుడ్ హాస్య చిత్రాలను తలదన్నేరీతిలో ఇదొక పరిశ్రమగా ఎదగాలని ఆశిస్తున్నాం. హాస్యాన్ని కార్పొరేట్‌స్థాయి తీసుకెళ్లిన ఎంటర్ టైన్‌మెంట్ ఇంజనీర్స్ ఆ పని తప్పక చేస్తుంది'' అంటూ ప్రశంసించారు.
Thursday, 15 December 2011
Wednesday, 14 December 2011
Subscribe to:
Posts (Atom)