Showing posts with label others. Show all posts
Showing posts with label others. Show all posts

Monday, 10 October 2011

Mimicry course (PSTU)




Potti Sreeramulu Telugu University (PSTU)


Evening Courses:

Postgraduate Diploma in Theatre Arts
Postgraduate Diploma in Travel and Tourism (Self Finance Course)
Postgraduate Diploma in Indian Management and Personality Development (Self Finance Course)
Postgraduate Diploma in Linguistics and Telugu Language Teaching
Postgraduate Diploma in Jyotirvastu – Modern Architecture
Diploma in Light Music
Diploma in Harikatha
Diploma in Yakshaganam
Diploma in Mimicry
Diploma in Padya Natakam
Diploma in Jyotisham
Certificate in Jyotisham

Wednesday, 28 September 2011

Voice Dubbing & Mimicry




Voice Dubbing & Mimicry
                                Category Suggested By : NEERAJ MEHRA                                                

                             Mimicry is an age-old art. The first mimicry artist might have been a caveman, who copied animal voices to keep them away. In Ramayana, when Rama chased Maricha  who was in the guise of the golden deer, Maricha shouted to attract Lakshmana in imitation of Rama's voice. In Mahabharata, Bhima used this art to entice and eliminate the villain Keechaka. Mimicry artiste should specialise in the imitation of voices.
                 It is broadly of two kinds: 
  • imitation of the manner of people's speaking; 
  • and reproduction of mannerisms, gestures, characteristics and idiosyncrasies of the concerned persons.

Tuesday, 27 September 2011

The Diary of LEKHA GUMMADI - 8 ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 8

ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 8
The Diary of LEKHA GUMMADI - 8


"నేనేమైనా మణులడిగానా, మాన్యాలడిగానా.. ఒకే ఒక మిరపకాయ బజ్జీ అడిగాను'' అంటూ సీనియర్ నటుడు కృష్ణ వాయిస్ ను అనుకరిస్తూ చేసిన కాసెట్.. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఆ డైలాగులు ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తుంటాయి. అదేదో నా మెమొరీ పవర్ అనుకుంటే అంతకంటే జోక్ ఇంకోటి ఉండదు. గంటక్రితం తిన్న కూరే గుర్తుండదు నాకు. అవును, అవి గుర్తున్నాయంటే, ఖచ్చితంగా మిమిక్రీ ఆర్టిస్ట్ గొప్పతనమే. అందులో ఇంకా చాలామంది నటుల గొంతులు ఉన్నాయి. ఎవరికి వారిదే excellent.. వాళ్ళే స్వయంగా మాట్లాడుతున్నంత సహజంగా ఉంటుంది. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో గానీ.. హాట్సాఫ్ ! అతనే కాదు, టాలెంట్ ఉన్న ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కీ నేను రుణపడిఉంటాను. ఈ మాటగానీ ఆ కళాకారులు వింటే, నేను వాళ్ళకి నిజంగానే బాకీపడ్డట్టు వచ్చి డబ్బులడగ్గలరు!

తొలి భారత మిమిక్రీ కళాకారిణి

                                    తొలి భారత మిమిక్రీ కళాకారిణి
                     ఒక వ్యక్తి ఒక కళలో నైపుణ్యం సాధిస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరే పలు కళల్లో ప్రజ్ఞ కనబరిస్తే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడతాం. అలా పలు కళల్లో ప్రజ్ఞ కనబరుస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి, యాంకర్‌, లైవ్‌ పెర్‌ఫార్మర్‌, ఆర్టిస్ట్‌ కోఆర్డినేటర్‌, షో అరేంజర్‌, రైటర్‌ ఆషాసింగ్‌ మన దేశపు మెుట్టమెుదటి మహిళా మిమిక్రీ కళాకారిణిగా గణతిెకక్కారు. ఆషా నాగపూర్‌ వాసి.
   

aashaa  దాదాపు 20ఏళ్ళ కిందట మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్‌ షోలు ఇస్తూ నలుగురి దృష్టినీ ఆకర్షించారామె. అప్పటి వరకు మగవారు మాత్రమే మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని ఆషా పలు స్టేజ్‌ షోలలో ఒకనాటి ప్రముఖ నటీమణులు మీనాకుమారి, ఆషాపరేఖ్‌, షర్మిలాటాగూర్‌, శ్రీదేవి, మాధురీదీక్షిత్‌, కరిష్మాకపూర్‌ వంటి తారల గొంతును అచ్చుగుద్దినట్టు పలికించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకునేవారు.

సోమయ్య మిమి'క్రీడ’ ఆదివారం ఆంధ్రప్రభ

                              సోమయ్య మిమి'క్రీడ’

   Sun, 27 Sep 2009, IST
మిమిక్రీ అనగానే అందరికీ గుర్తు వచ్చేది హీరోలూ, రాజకీయనాయకుల అనుకరణ, ఎక్కడైనా కనిపించేది వినిపించేది ఇదే. కానీ ఇందుకు భిన్నంగా ఓ పేద యువకుడు పక్షులూ, ప్రకృతిలో ఉండే శబ్దాలను మిమిక్రీ ద్వారా అనుకరిస్తూ ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. పాఠశాలలు, సమావేశాల్లో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, అందరి అభిమానాన్ని పొందుతూ, అచ్చం బాబూమోహన్‌ మాదిరిగా కనిపించే ఈ యువకుడే సోమయ్య.

Friday, 24 June 2011

సెల్ ఫోన్ ఉంది కదా అని తెగ ఫోన్స్ చేస్తే ఇదిగో ఇదే రీపీట్ అవుద్ది ......జాగ్రత్హ

Young Suicide Attempt
 సెల్ ఫోన్ ప్రేమాయణం ఓ యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా పారాపట్టికి చెందిన తిరుపతి అనే 35 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం విలుపురం జిల్లా తిరక్కోవిలూరుకు చెందిన మేరి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరువురు తరుచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. నిత్యం మేరీతో మాట్లాడుతున్న తిరుపతి ఆమె ప్రేమలో పడి పోయాడు. ఆమెతో నిత్యం కబుర్లు చెప్పేవాడు. అయితే రెండేళ్లుగా మేరీతో మాట్లాడుతూ ప్రేమలో మునిగి పోయిన తిరుపతికి తన ప్రేయసి ఎలా ఉందో చూడాలనిపించింది. అంతే తడవుగా ఇటీవల మేరీ చిరునామాను కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక ఆమె వయసు అరవై సంవత్సరాలు అని తెలిసి తిరుపతి ఖంగు తిన్నాడు. దీంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. అదే జిల్లాలోని హోగినెకల్ శివారులో గురువారం సాయంత్రం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా తిరుపతి ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. గస్తీ పోలీసులు దానిని గమనించి తిరుపతిని అదుపులోకి తీసుకొని విచారించారు.                                                                                                             నోట్: ఈ వార్త   గ్రేట్ ఆంధ్ర సౌజన్యం తో........

Monday, 20 June 2011

వివిధ దేశాల్లో మిమిక్రీ కి గల పేర్లు

MIMICRY NAMES IN VERIOUS COUNTRIES
--------------------------------------------------------------------------
1) Afrikaans:   na-apery     
2) Arabic: تَقْليد، مُحاكاه       
3) Bulgarian:   имитиране
4) Breton:       imitação    
5) Czech:        mimikry    
6) German:    das Nachahmen, die Mimikr
7) Danish:      efterligning; parodi    
8) Greek:        μιμική   
9) Spanish:     imitación
10) Estonian:  järeleahvimine   
11) Farsi:         تقلید  
12) Finnish:   jäljittely
13) French:   imitation   
14)Hebrew:    חִיקוּי  
15) Hindi:    नकल करना
16) Croatian:  oponašanje, mimikrija   
17) Hungarian: mimikri; utánzás   
18) Indonesian: mimikri
19) Icelandic:   eftirhermur, skopstæling  
20) Italian:   mimica, imitazione
21) Japanese:   物まね
22) Korean:   흉내내기   
23) Lithuanian:   mimikrija
24) Latvian: mimikrija
25) Malay:   membuat mimik
26) Dutch:   mimiek, imitatie, mimicry  
27) Norwegian:  etteraping, herming, paro
28)  Polish:  mimikra
29) Persian:   تقلید     
30) Pashto:    تقليد 
31) Portuguese: imitação
32) Romanian: mimare; imitare
33) Russian: имитирование
34) Slovak: mimikry
35) Slovenian: posnemanje
36) Serbian:   imitacija
37) Swedish: härmande, härmning
38) Thai:   การล้อเลียน
39) Turkish: taklitçilik
40) Taiwanese:   模仿
41) Ukrainian:   імітування; мімікрія
42) Urdu:      نقالی کا ہنر
43) Vietnamese: tài bắt chước
44) Chinese:    摹拟

Thursday, 16 June 2011

నాకు నచ్చిన సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం .. మన పల్లెతల్లి కోసం అశోక్ తేజ రాసిన పాట .

జన్మభూమి పిలుస్తోంది..నీ పుణ్యభూమి పిలుస్తోంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్షం చేయవు
ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

చేతులెత్తి ధీనంగా నిలచున్నది ఎవరామె.
చిన్ననాడు మనల ఒడిలొ ఆడించిన గ్రామమే
పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

పది మైళ్ళు బడికి నడచి వెళ్లిన జ్ఞాపకముందా
వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా..
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

కడుపులొ పాతాళగంగలుబుకుతున్న బీడు, భగీరథుడివై రమ్మని పలుకుతుంది చూడు..
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.

తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..