Tuesday, 20 March 2012
ప్రముఖ సిని గీతరచయత శ్రీ అనంత శ్రీరాం గారితో నేను
మా నాన్న స్వర్గీయ శ్రీ రామచంద్రయ్య జల్లారపు గారు
Saturday, 4 February 2012
ఆషాసింగ్ మన దేశపు మెుట్టమెుదటి మహిళా మిమిక్రీ కళాకారిణి
మిమిక్రీ ఆషాజీ
ఒక వ్యక్తి ఒక కళలో నైపుణ్యం సాధిస్తే
గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరే పలు కళల్లో ప్రజ్ఞ కనబరిస్తే వారిని
బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడతాం. అలా పలు కళల్లో ప్రజ్ఞ కనబరుస్తూ పేరు
ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి, యాంకర్, లైవ్ పెర్‌ఫార్మర్, ఆర్టిస్ట్
కోఆర్డినేటర్, షో అరేంజర్, రైటర్ ఆషాసింగ్ మన దేశపు మెుట్టమెుదటి మహిళా
మిమిక్రీ కళాకారిణిగా గణతిెకక్కారు. ఆషా నాగపూర్ వాసి.
దాదాపు
20ఏళ్ళ కిందట మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్ షోలు ఇస్తూ నలుగురి దృష్టినీ
ఆకర్షించారామె. అప్పటి వరకు మగవారు మాత్రమే మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు.
ఆ సంప్రదాయాన్ని తోసిరాజని ఆషా పలు స్టేజ్ షోలలో ఒకనాటి ప్రముఖ నటీమణులు
మీనాకుమారి, ఆషాపరేఖ్, షర్మిలాటాగూర్, శ్రీదేవి, మాధురీదీక్షిత్,
కరిష్మాకపూర్ వంటి తారల గొంతును అచ్చుగుద్దినట్టు పలికించి ప్రేక్షకుల
కరతాళ ధ్వనులు అందుకునేవారు.అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె తన నివాసాన్ని ముంబైకి మార్చారు. అక్కడికి వెళ్లాక ఆమె మిమిక్రీ షోలతో బాగా బిజీ అయ్యారు. దాంతో పాటే కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించే అవకాశాలు సంపాదించారు. అలా ఒక పక్క మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ టీవీల్లో నటిస్తూనే ఆషా మ్యూజికల్ గ్రూప్‌ను స్థాపించి, భిలాయ్‌లో ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంట్, సహారా లేక్ సిటీ, అంబీవాలీ, హోటల్ సీ ప్రిన్సెస్, రామీ గెస్‌టలైన్, నిషీల్యాండ్ పార్క్ వంటి చోట్ల ఆర్కెస్ట్రాలు ఇచ్చేవారు.
ప్రతి న్యూ ఇయర్ వేడుకలలో నాగపూర్‌లోని ప్రముఖ హోటళ్ళలో ఆమె మిమిక్రీ ప్రోగ్రామ్ గానీ, ఆర్కెస్ట్రా గానీ ఉండాల్సిందే. అంతలా ఆమె నాగపూర్ వాసుల హృదయాలను దోచుకున్నారు.1986లో నాగపూర్‌కు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్సవాలకు హాజరైన బిగ్‌బి అమితాబ్ ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆషా సింగ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి ఆమె ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు.
ఇదిలా ఉండగా 1997లో ఆషాసింగ్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో అతిపెద్ద స్టార్ షోను ఏర్పాటు చేసారు. ఆ షోలో అప్పటి ప్రముఖ బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తి, అస్రానీ, గుల్షన్‌గ్రోవర్, ఖాదర్‌ఖాన్ వంటివారు పార్టిసిపేట్ చేసారు. అక్కడ ఆషా ప్రదర్శించిన మిమిక్రీ ఐటెమ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అక్కడి నుంచి ఆషా పేరు బాలీవుడ్‌లో కూడా తరచూ వినిపించడం ప్రారంభించింది. దాంతో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. అలా ఆమె బాజీగర్, ఆగ్, న్యాయ్ అన్యాయ్, ఏ ఆగ్ కబ్ భుజేగీ, దో మత్వాలే, స్వర్గ్ జైసా ఘర్, పోలీస్ ఆఫీసర్, దీదర్, దివ్యశక్తి, ఖుదాకానూన్, మహబూబ్ మేరే మహ్‌బూబ్, గీత్ మిలన్‌కె గాతే రహేంగే, కహానీ కిస్మత్‌కీ వంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు భోజ్‌పురి, రాజస్థానీ, గుజరాతీ, చత్తీస్ ఘడ్, పంజాబీ వంటి విభిన్న భాషా చిత్రాల్లో కూడా నటించారు.
ఇక టీవీ సీరియల్స్ విషయానికి వస్తే మహాభారత్, కిస్సేమియా బీవీకే, మజ్‌దార్, ఆఖిరీ దావ్, ఉల్జీరహే, చల్తీరహే, జిందగీ, పూల్ కిలే గుల్షన్ గుల్షన్, ఇంద్రధనుష్, మిట్టీకే రంగ్, చంద్రకాంత్, విరాట్, అపరాజిత, అర్థాంగిని, ఔరత్, కామ్‌యాబీ, జానూన్, సాహిల్, షేక్, రిపోర్టర్, కమాండర్, పరంపర, అపరాధ్, దరార్, యూలే లవ్ స్టోరీస్, అక్బర్ బీర్బల్, షాహీన్, నజ్జీకియాన్, కామినీ దామినీ వంటి వాటిలో నటించారు. నాగపూర్‌లోని సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆషాసింగ్‌కి చిన్నతనం నుంచీ కళలంటే ఎంతో మక్కువ. సినిమాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా ఆమె మీనాకుమారిని ఆరాధించేవారు. దాంతో తనకు తెలియకుండానే ఆమెపై మీనాకుమారి ప్రభావం పడింది.
ఆమెలానే మాట్లాడేందుకు, కనిపించేందుకు ప్రయత్నించేవారు. ఆమె ధోరణికి ఇంట్లోవారు తొలుత అభ్యంతరం తెలిపినా తర్వాత తర్వాత అలవాటు చేసుకున్నారు. పెళ్ళయ్యాక కూడా ఆమె ధోరణిలో మార్పు రాలేదు. అయితే ఆమె భర్త ఆమెను ఏనాడూ ఆమెపై ఎటువంటి ఆంక్షలు పెట్టేవారు కాదు. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో మెల్లగా తెలిసిన వారి ముందు చేసే మిమిక్రీని బయట స్టేజ్‌పై చేయడం మొదలుపెట్టారు.
Tuesday, 24 January 2012
Tuesday, 10 January 2012
Friday, 30 December 2011
Tuesday, 27 December 2011
Wednesday, 21 December 2011
నవ్వుల రాజులు ఈ ఇంజినీర్లు
ఐఐటి ఇంజినీర్లు నవ్వుల
రాజులయ్యారు
ఐఐటీ చదివింది నవ్వులపాలవ్వడానికా..? నవ్వుల రాజులవ్వడానికా...? అదరగొట్టే ప్యాకేజ్‌లతో అందివచ్చిన ఉద్యోగాలను వద్దుపొమ్మన్న ఈ నలుగురు ఐఐటీ ఇంజనీర్లు గిలిగింతలు పెట్టే విజయాన్ని ఎలా సాధించారో చూస్తే, ఉద్యోగమో రామచంద్రా అంటూ చెప్పులరిగేలా తిరిగే యువతీయువకులకు బోలెడు స్ఫూర్తి వస్తుంది...
"అంత కష్టపడి ఐ.ఐ.టి. చదివి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలొస్తే వద్దుపొమ్మంటారా..? మీరేంటి గురూ జీవితాన్ని ఇంత కామెడీగా తీసుకుంటున్నారు..?''
క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలొచ్చిన తోటి విద్యార్థులందరూ ఆ నలుగురు తీసుకున్న నిర్ణయానికి విస్తుపోయారు. వాళ్లు చుట్టూ చేరి నచ్చజెబుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు తప్పిస్తే, కిం చిత్తు రాజీపడటం లేదు ఆ నలుగురు."...ఇక, మేము ఎంత చెప్పినా వినేట్టు లేరు కానీ, ఆఖర్న ఒక మాట చెబుతున్నాం. మీరు కనుక ఈ ఉద్యోగాలను కాదనుకుంటే... భవిష్యత్తులో నవ్వులపాలవ్వడం ఖాయం..'' అంటూ లేచివెళ్లిపోతున్న స్నేహితులను చూస్తూ.. ఆ నలుగురు మళ్లీ పగలబడి నవ్వారు.
"అవును, మేము నవ్వులపాలవ్వాలని డిసైడయ్యాం. మేమే కాదు త్వరలో మిమ్మల్ని కూడా నవ్వులపాలు చేస్తాం. బీ కేర్‌ఫుల్..'' అన్నారు మూకుమ్మడిగా.
"వీళ్లకు పిచ్చి ముదిరిపోయింది'' గొణుక్కుంటూ వెళ్లిపోయారు క్యాంపస్ మిత్రులు.
***
"శభాష్‌రా, ఆ రోజు ఉద్యోగాలు వద్దనుకున్న మిమ్మల్ని చూసి పిచ్చోళ్లు అనుకున్నాం. ఈ రోజు మీ హాస్యాన్ని చూసి మేం పిచ్చెక్కిపోయాం'' అన్నారు ఐఐటి చదువుకున్న రోజుల్లో కలిసి తిరిగిన స్నేహితులు. ఎంతో కష్టపడితే కానీ, ఈ స్థాయికి ఎదగలేదంటున్న ఆ నలుగురే 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్' వ్యవస్థాపకులు. పట్టా చేతికొస్తూనే 'ప్యా కేజ్'లతో కొట్టుకుపోతున్న నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న వాళ్లు.. హ్యూమర్‌ను కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు.
నలుగురిదీ నవ్వుల మార్గమే...
బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితిన్‌గుప్తా, ప్రశాంత్, విపుల్ గోయెల్, తుషార్ ఉపాధ్యాయ చిన్నతనం నుంచే హాస్యం రుచిమరిగారు. హాస్యకవితలు రాయడం, సెటైర్లు కొట్టడం, నాటికల్లో నటించడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో రాటుదేలారు. అభిరుచితో వచ్చిన ఆ నైపుణ్యాలతోనే కెరీర్‌ను మలుచుకోవచ్చనుకున్నారు. ఐఐటీ పూర్తి చేశాక హ్యూమర్‌నే పెట్టుబడిగా పెట్టి ఓ కంపెనీ పెట్టారు. అలా పుట్టిందే 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్'.
"హ్యూమర్ అనేది మనుషులకు మాత్రమే అపురూప వరం. మా కంపెనీ 'ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్'కు అదే పెట్టుబడి. నవ్వించగలిగే సామర్థ్యమే మాకున్న నైపుణ్యం. అందరూ నడిచేదోవలోనే ఎందుకు నడవాలి..? కొత్త మార్గంలో నడిస్తే వచ్చే నష్టమేమీ లేదు కదా..! అందుకే, మంచి ఉద్యోగాలొచ్చినా వద్దనుకున్నాం. ఈ-జనరేషన్ అనేక ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య బతకాల్సి వస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్‌లకు ఇప్పుడెంత డిమాండ్ ఉందో... రేపు హ్యూమర్‌కు కూడా అంతే డిమాండ్ ఉండబోతోంది.
అవి సక్సెస్ అవాలంటే హ్యూమర్ పండటం చాలా ముఖ్యం. మెట్రోనగరాల్లో కొత్తగా విస్తరిస్తున్న అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో సైతం కామెడీ షోలకు గిరాకీ పెరుగుతోంది. యూనివర్శిటీలు, స్కూల్స్‌లో కూడా కామెడీ షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీరంతా నవ్వగలిగినంత కాలం మా కంపెనీకి ఢోకా లేదు..'' అంటాడు దీని వ్యవస్థాపకులు, చీఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీసర్ (సీఈవో) అయిన నితిన్‌గుప్తా.
బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన 'లవ్ డిసెంబర్' హాస్యనాటికతో పాపులర్ అయ్యారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇంజనీర్స్‌లో 'హ్యూమర్ రిసోర్సెస్' (హెచ్.ఆర్)గా విపుల్ గోయెల్ చేరాడు. ఈయన కూడా ఐఐటీ బాంబేలోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. కామెడీ షోల నిర్వహణ బాధ్యత అతనిదే. హాస్యనటుడు తుషార్ ఉపాధ్యాయ నవ్వుల కంపెనీ మొత్తానికి వెన్నెముకలాంటి వాడు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన గతంలో- అంతర్ కళాశాలల వేడుకల్లో ఉత్తమ హాస్య నటుడుగా బోలెడన్ని బహుమతులు కొట్టేశాడు. కామెడీషోలలో గంటల తరబడి నిల్చుని నవ్వులు కురిపించే ఉపాధ్యాయ అలసటన్నదే ఎరుగడు. "నేను విసిరే హాస్యోక్తులు, పలికించే హావభావాలకు జనా లు విరగబడి నవ్వుతుంటే... నాకు కడుపు నిండిపోతుంది'' అంటాడాయన.
లాఫింగ్ రీసెర్చ్...
బాలీవుడ్ ప్రముఖులు సుభాష్‌ఘయ్, శేఖర్‌కపూర్‌లు వీళ్ల కామెడీషోలను చూసి.. "ఈ కామెడీ షోలను చూస్తుంటే భారత్‌లో హాస్యానికి మళ్లీ మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. బాలీవుడ్ హాస్య చిత్రాలను తలదన్నేరీతిలో ఇదొక పరిశ్రమగా ఎదగాలని ఆశిస్తున్నాం. హాస్యాన్ని కార్పొరేట్‌స్థాయి తీసుకెళ్లిన ఎంటర్ టైన్‌మెంట్ ఇంజనీర్స్ ఆ పని తప్పక చేస్తుంది'' అంటూ ప్రశంసించారు.
Thursday, 15 December 2011
Wednesday, 14 December 2011
Tuesday, 8 November 2011
GREAT MIMICRY ARTIST RAJABABU
తెలుగు సినీ వినీలాకాశంలో
తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి
మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా
వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం
చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న
మొదటి కమెడియన్ రాజబాబు.
మహాకవి శ్రీశ్రీకి తోడల్లుడు రాజబాబు. నరసాపురంలో 1938 అక్టోబర్ 20న జన్మించి, మండపేటలో పెరిగి, రాజమండ్రిలో కళాకారుడిగా ఎదిగి, మద్రాస్ చేరి సినిమాల్లో హాస్యనటుడిగా స్థిరపడి అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని రాజబాబుగా అలరించారు పుణ్యమూర్తుల అప్పలరాజు.
ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.
1960లో మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ టైమ్‌లో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.
ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.
అడపాదడపా చిన్నచిన్న వేషాలు వేసినా జగపతి వారి అంతస్తులు చిత్రం ఆయన నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు. బిజీ అయిపోయారు. ఒక దశలో రోజుకు రెండు, మూడు షిప్ట్‌లు పనిచేసిన సందర్భాలు కూడా వున్నాయి. హాస్యనటుడిగానే కాక కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందర్నీ నవ్వించి ఆనందపర్చిన రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పరచి ప్రతీ పుట్టినరోజున ఒక ప్రముఖుడ్ని సన్మానించి మూడురోజులపాటు నాటకప్రదర్శనలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే తన నటజీవితానికి ప్రేరణ అయిన అప్పటి హాస్యనటుడు బాలకృష్ణ(అంజి)ని సన్మానించారు.
మహాకవి శ్రీశ్రీకి తోడల్లుడు రాజబాబు. నరసాపురంలో 1938 అక్టోబర్ 20న జన్మించి, మండపేటలో పెరిగి, రాజమండ్రిలో కళాకారుడిగా ఎదిగి, మద్రాస్ చేరి సినిమాల్లో హాస్యనటుడిగా స్థిరపడి అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని రాజబాబుగా అలరించారు పుణ్యమూర్తుల అప్పలరాజు.
ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.
1960లో మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ టైమ్‌లో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.
ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.
అడపాదడపా చిన్నచిన్న వేషాలు వేసినా జగపతి వారి అంతస్తులు చిత్రం ఆయన నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు. బిజీ అయిపోయారు. ఒక దశలో రోజుకు రెండు, మూడు షిప్ట్‌లు పనిచేసిన సందర్భాలు కూడా వున్నాయి. హాస్యనటుడిగానే కాక కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందర్నీ నవ్వించి ఆనందపర్చిన రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పరచి ప్రతీ పుట్టినరోజున ఒక ప్రముఖుడ్ని సన్మానించి మూడురోజులపాటు నాటకప్రదర్శనలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే తన నటజీవితానికి ప్రేరణ అయిన అప్పటి హాస్యనటుడు బాలకృష్ణ(అంజి)ని సన్మానించారు.
సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ మిమిక్రీ
పొట్టగొడితే.. పోగాలమే! ...... నినదించిన జగన్ ‘రైతు దీక్ష’
* భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు*
మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం.. * మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు
నిరసన* జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష* ప్రభం‘జనం’తో
కిక్కిరిసిన ఐదో నంబర్ జాతీయ రహదారి* నిప్పులు కక్కుతున్న ఎండను సైతం
లెక్కచేయక కాలినడకన వచ్చిన ప్రజలు.. ఉదయం 9 గంటలకే‘వైఎస్సార్ రైతు
ప్రాంగణం’లో జన హోరు* సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు ‘‘నోటికాడికి
ముద్దను తెచ్చే చేతుల్ని నరికే ప్రభుత్వమిది. రైతుల్ని
ఇబ్బందిపెట్టినోళ్లంతా ఏమయ్యారు..? ఈ సర్కారూ గాల్లో కలిసేదే.’’‘‘వైఎస్
ఉన్నప్పుడు మద్దతు ధర రూ.వెయ్యి వచ్చేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.600
మాత్రమే వస్తోంది.’’‘‘మొన్నటి తుపానుల పరిహారాలకే దిక్కులేదు. బ్యాంకు
రుణాల్లో ఇన్సూరెన్స్ కింద కొంత కోతకోసినా.. ఈ సర్కారు హయాంలో మాకు
నష్టపరిహారం సొమ్ము వచ్చింది లేదు.’’.... ఇదీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’లో అన్నదాతల
ఆవేదన, ఆగ్రహ జ్వాల. వేసవి కాలం.. భానుడు చండ ప్రచండంగా మండిపోతున్నాడు..
అందులోనూ గుంటూరు.. 42 డిగ్రీలతో నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటు
‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో ఇలా రైతు సూరీడు కూడా అంతే స్థాయిలో ఆగ్రహ
జ్వాలలు కక్కుతున్నాడు. తమ బాధలు పట్టని సర్కారుపై నిప్పులు
చెరుగుతున్నాడు.. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర
రాకపోవడం, వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు తమ ఆవేదన,
ఆక్రందనల్ని ఆదివారం ‘రైతు దీక్ష’లో వెళ్లగక్కారు. తమను పట్టించుకోకుండా
మిల్లర్లకు ఊతమిస్తూ తమ పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎండ
నిప్పుల కొలిమిని తలపిస్తున్నప్పటికీ.. జగన్ దీక్షకు జనం ప్రభంజనమై
పోటెత్తారు. తమకు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి
అన్నదాతలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ నినాదాలతో, పోటెత్తిన అశేష
జనవాహిని సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నిరాహార దీక్ష ప్రారంభించారు. మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు కొనసాగే ఈ
దీక్ష 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.రైతు నేతకు నివాళితో దీక్ష
ప్రారంభం.. శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో
నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో
దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర
ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్
వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్
విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు.
అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతునేత తికాయత్‌మృతికి సంతాపంగా రెండు
నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సమస్యల గోడు వెళ్ళబోసుకోవటానికి వచ్చిన
రైతులతో జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘మీ నాయన బతికుంటే మా
బతుకులు బాగుండేవయ్యా’ అంటూ మాచర్లకు చెందిన సింహాద్రి రాములు తన
పరిస్థితిని విన్నవించాడు. నాలుగు ఎకరాల్లో పంట వేస్తే అపారనష్టం
వాటిల్లిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన
వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రూ.600కు కూడా ధాన్యం కొనే నాథుడే లేడని
రైతులు తమ ఆవేదనను వివరించారు. మద్దతుగా వేలాదిమంది దీక్షదీక్ష
ప్రాంగణంలో జగన్‌కు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష ప్రారంభించారు.
దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీ,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అడుగడుగునా అన్నదాతను
నిర్లక్ష్యం చేసిన ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు.
సమస్యలను, సిద్ధాంతాలను విస్మరించి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని నేతలు
ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి వంగపండు కుమార్తె ఉష ఆధ్వర్యంలో
సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ చేసిన
మిమిక్రీ, గీతాలు ఆహూతులను అలరించాయి. యువత స్వచ్ఛందంగా వాలంటీర్ బాధ్యతలు
స్వీకరించి దీక్షకు హాజరైన రైతులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు. 9 గంటల
నుంచే జనహోరురైతులు భారీస్థాయిలో దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు,
యువకులు, వృద్ధులు ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో
చేరుకున్నారు. గుంటూరు, కర్నూలు, చిలకలూరిపేట రోడ్డు(ఎన్‌హెచ్ 5) వాహనాల
రద్దీతో కిక్కిరిసింది. ఒకవైపు రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండగానే, మరోవైపు
గుంటూరుకు సమీపాననున్న అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, జూనంచుండూరు,
వింజనంపాడు, నల్లపాడు తదితర గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన
దీక్షాశిబిరానికి వచ్చారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు
పసిపిల్లల్ని చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం
విశేషం. ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతో పాటు శిబిరం వద్ద
బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం దీక్షకు వచ్చిన జనం, జగన్ ప్రభావం, నేతల
ప్రసంగాల గురించి చర్చించుకోవడం కనిపించింది. ఎంతమంది జనం వచ్చారు.
ఎక్కడెక్కడ్నుంచి వచ్చారు. ఎలా వచ్చారంటూ వివరాల్ని పోలీసులు పదేపదే అడిగి
తెలుసుకున్నారు. నేతల ప్రసంగాలప్పుడు ప్రాంగణంలోని యువత జిందాబాద్‌లతో
హోరెత్తించారు. తమ అభిమాన నేత జగన్ ప్రసంగం కోసం పదేపదే డిమాండ్ చేశారు.
ఆయన్ను కలుసుకుని అభినందించేందుకు, కరచాలనం చేసేందుకు అందరూ ఉత్సాహం చూపడం
కనిపించింది. జగన్ చేతిని పెకైత్తి అభివాదం చేసినప్పుడల్లా ప్రాంగణంలో జై
జగన్ నినాదాల హోరు మార్మోగింది. జగన్ మెజార్టీపై అభినందనలు....రెండురోజుల
కిందటే కడప పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా రికార్డు మెజార్టీని
సాధించిన జగన్ విజయోత్సాహాలను కూడా పక్కనపెట్టి రైతు దీక్ష చేయడంపై పలువురు
నాయకులు ప్రశంసించారు. జగన్ నిత్య శ్రామికుడిగా రైతు పక్షాన పోరాటాలు
చేయడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతోందని కొనియాడారు. జగన్ రికార్డు
మెజార్టీతో దేశంలో తెలుగువారి ఆత్మగౌరవం మరొక్కసారి ప్రకటితమైందన్నారు.
జగన్ మెజార్టీ గురించి ప్రస్తావించినప్పుడు సభకు హాజరైన వారు కరతాళధ్వనులు
చేశారు. ప్రాంగణంలో భారీ విద్యుత్ ప్రభ..రైతు దీక్షా వేదిక ప్రాంగణంలో
98 అడుగుల భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ప్రభ ప్రాంగణానికి నూతన
శోభను తీసుకొచ్చింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన కొల్లి
సుబ్బారెడ్డి అనే రైతు వెయ్యి బల్బులతో ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలాగే
దీక్షా వేదిక ప్రాంగణంలో 20 వరకు బెలూన్లను ఎగురవేశారు.
Thursday, 3 November 2011
EXCLUSIVE NANDAMURI BALAKRISHNA GARI GETUP IN SREE RAMARAJYAM
AKKINENI NAGARJUNA GARI CHILDHOOD RARE PHOTO
Subscribe to:
Posts (Atom)





















