Monday 3 October 2011

మిమిక్రీ ... మిమిక్రీ ..

                         



                               ఇది ఓ ఊరిలో జరిగిన సన్నివేశం 
                                 ఆంధ్రప్రభ లో ప్రచురితం.....

     


 అనుకరించడమనే విధానం ఈనాటికిది కాదు. సృష్టి జరిగినప్పటి నుండీ... సృష్టిలో ఎక్కడో ఒకచోట ఓ జీవి మరో జీవిని అనుకరించడం జరుగుతూనే వుంది.
ఆత్మాభిమానంతో, అభిమానంతో తన కృషి వివరించాలే తప్ప అహంభావం... అహంకారం పనికి రాదు.
'విద్యా వినయేన శోభతే!' సాపేక్ష సిద్ధాం తాన్ని రూపకల్పన చేసిన ఐన్‌స్టీన్‌ వంటి మహానుభావుడే... 'నాకు తెలిసింది విజ్ఞాన మనే సముద్రంలోని నీటి బిందువులో వెయ్యోవంతు మాత్రమే'నని సవినయంగా అన్నాడు. అనుకున్నారు వాళ్లంతా.
ఇంతలో మాధవ్‌ మళ్లిd మైక్‌ ముందుకు వచి చెప్పడం ప్రారంభించాడు.
''మిమిక్రీ కళకు అక్షరమాలను నేనే రచించాను. అనుక్రమణికను కూడా సృష్టించాను. ఎలా మిమిక్రీ ప్రదర్శితమవ్వాలో నిర్వచించాను...'' ఇలా ఆయన ఉపన్యాసం సాగిపోతూనే వుంది.
ఇంతలో జనం మధ్యలోంచి మళ్లిd కేకలు..
''మిమిక్రీ చూపించండి... మిమిక్రీ కావాలి...''
ఇక ఏమనుకున్నాడో మాధవ్‌ ఉపన్యాసం ఆపేసి ప్రదర్శన ప్రారంభించాడు.
''ముందుగా పక్షల కిలకిలా రావాలను అనుకరిస్తాను. సూర్యోదయం సమయంలో వాతావరణం ఇలా వుంటుంది...'' అంటూ....
మైక్‌ ముందు చేయి అడ్డంగా పెట్టుకొని నోటిని మైక్‌ దగ్గరపెట్టి చిత్రమైన ధ్వనులు చేయడం ప్రారంభించాడు.
ఉషోదయానికి చిహ్నంగా చల్లని మలయమారుతం వీస్తున్న చప్పుడు... పక్షుల కిలకిలా రావాలు...
పాలకోసం తల్లి ఆవుల దగ్గరకు పరుగులు తీసే లేగదూడల 'అంబా' ధ్వనులు!
నిజంగానే అంతరాత్రి పూట అందరికీ ఉషోదయాన్ని సాక్షాత్కరింపచేశాడు మాధవ్‌.
రకరకాల పశు పక్ష్యాదుల కంఠధ్వనిని అనుకరించి అవి అక్కడ ఉన్నాయనే భ్రమ కలిగించాడు.
అనంతరం ''ఇప్పుడు సినిమా నటులను అనుకరి స్తాను. ముఖ్యంగా అమరులైన మహా నటీనటులను, గాయకులను, గాయనీ మణులను వారి గొంతులను అనుకరిస్తాను...'' అంటూ ప్రారంభించాడు.
అలనాటి మహానటులు వివిధ సినిమాలలో చెప్పిన డైలాగులు వింటుంటే.. వారే పునర్జన్మ పొంది ఎదుటికి వచ్చి మాట్లాడుతూ మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారా అనిపించింది.
నటీమణుల గాత్రం సైతం అందరినీ అలరించింది. గాయకులు, గాయనీమణుల గొంతుతో మనోహరమైన మధురమైన గీతాల పల్లవులు పాడి వినిపించాడు మాధవ్‌.
జనంలోంచి కేరింతలు... కరతాళధ్వనులు... ఆనందాతి రేకంతో పరవళ్లు త్రొక్కాయి.
ఇంతలో... సభలోంచి ఎక్కడో ఓ కుక్క అరుపు వినిపించింది.
ఎవరూ గమనించలేదు. గానీ ఆ అరుపు విని నిజంగానే ఎన్నో కుక్కలు ఆ సభవైపు వచ్చి మొరగ నారంభించాయి. దాంతో సభకు అంతరాయం కలిగింది.
ప్రిన్సిపాల్‌ సైగ చేయడం ఆలస్యం... అటెండర్లు వాటి వెనకబడి తరమడానికి ప్రయత్నించారు.
అయినా అవి మొరగడం ఆపలేదు. ఉన్నచోట నుంచి కదలడం లేదు.
సభంతా అసహనంగా తయారైంది. వేదిక మీద వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.
నేనుండ బట్టలేక మాధవ్‌ గారితో అన్నాను ''మీరు ఆ కుక్కల అరుపుల్ని అనుకరించి వాటిని ఆపు చేయించలేరా?'' అని.
ఆయనా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఇంతలో సభలోంచి మళ్లిd ఓ కుక్క అరుపు వినిపించింది.
అంతే! కుక్కలన్నీ అరుపులు ఆపేసి తోకలు ఆడించుకుంటూ నిలబడ్డాయి.
''ఎవరూ? కుక్కలా అరిచిన ఆ వ్యక్తి ఎవరు?'' మాధవ్‌గట్టిగా అడిగాడు.
సభలోంచి సమాధానం రాలేదు.
మరోసారి ఇంకొక మాడ్యు లేషన్‌లో మూడో కుక్క అరుపు వినిపించింది.
కుక్కలన్ని నెమ్మదిగా కూర్చో వడం ప్రారంభించాయి.
వేదికమీద ఉన్న మా అందరికీ మతి పోయింది.
అప్పటికే మొహం మాడిపోయిన మాధవ్‌ ''కుక్క అరుపులు అరిచిన ఆ వ్యక్తి ఎవరు?'' అంటూ ఉక్రోషంగా గొంతు చించుకున్నాడు.
''నేనే స్వామీ!'' అంటూ ఆడియన్స్‌ మధ్యలోనించి ఓ కుర్రవాడు లేచి నిలబడ్డాడు.
నిక్కరు షర్ట్‌.. భుజంపై ఓ తువ్వాలు... చేతిలో ములుగర్ర. గొడ్ల కాపరీలా ఉన్నాడు.
ముందు వరసల్లోని వి.ఐ.పి.లు వెనకకు తిరిగి చూచారు.
''వాడా... ఎల్లమంద అండీ... మన ఎంకటి పాలేరు కుర్రాడు'' అంటూ ఆ ఊరి సర్పంచ్‌ ఆ కుర్రవాడెవరో ఇట్టే చెప్పేశాడు.
మళ్లిd ఆయనే అన్నాడు ''ఒరేయ్‌! ఎల్లమందా! వాటిని వెనక్కి పంపించెయ్యరా'' అని.
వాడు చేయి అడ్డంపెట్టుకొని మళ్లిd ఓ కుక్క అరుపు అరిచాడు.
అంతే...అవి తోకలూపుకుంటూ దూరంగా వెళ్లి పోసాగాయి.
''అతనికి ఇంకా ఏమయినా వచ్చా?'' వివరాలకోసం మాధవ్‌ అడిగాడు.
''ఆ సచ్చినాడు.. మా గేదెల దగ్గరకొచ్చి ఏదో కూత కూశాడు. అవి పాలివ్వడం మానేశాయ్‌. వాడి కింత అన్నం పెడితే అది తిని మరో కూత కూశాడు వాడు. అవి పాలివ్వడం మొదలు పెట్టాయి'' అంటూ
ఆడియన్స్‌ లోంచి ఒక్కొక్కరూ లేచి వాడితో తమ అనుభవాలను వివరిస్తున్నారు.
''రాత్రిపూట వీధిలో పోయే కుక్కల్ని మొరిగిస్తాడు... వాటిని లేపుతాడు... ఆడిస్తాడు.
వాడు గేదెల్ని కాయడు. ఒక చెట్టుకింద కూర్చుంటాడు. రకరకాల అరుపుల్తో వాటిని తన చుట్టూ తోకాడించుకుంటూ తిరిగేలా చూస్తాడు.
మొన్నీ మధ్యనే వీడు ఎక్కడి నుండో ఆడకోయిలల్ని రప్పించాడు. నెమలుల్ని తన కూతలతో తెప్పించాడు''
సభలోని వారు వాడు చేసిన చేష్టలన్నీ అనుభవాలుగా చెబుతున్నారు.
అవన్నీ వినగానే మాకు వాడి గొప్పతనమేమిటో అర్థమైంది.
మాకంటే మాధవ్‌కు బాగా అర్థమైంది. అందుకే మాధవ్‌ మాట్లాడడం మొదలు పెట్టాడు.
''ఈ సృష్టిలో విచిత్రమేమంటే.. మానవుడు మాత్రమే ఇతర మానవుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, సమస్త జీవ రాశుల్ని అనుకరిస్తాడు. కానీ ఏ జంతువూ మరో జంతువును అనుకరించదు. తన జాతికి చెందిన జంతువు అరుపు విన్నాకనే అది స్పందిస్తుంది. ఇంతకు ముందు నేను వినిపించిన ఎన్నో జంతువుల అరుపులు మిమ్మల్ని అలరించాయే గానీ వాటిని ఆకర్షించలేక పోయాయి.
ఎల్లమంద వినిపించిన అరుపులతో కుక్కలు తిరిగి వెళ్ళి పోయాయి.
అంటే ఎల్లమంద అరిచింది తమ జాతి జంతువుల అరుపులేనని గుర్తించాయి''
కొంచెం మంచినీళ్లు త్రాగి మళ్లిd మాధవ్‌ మొదలుపెట్టాడు.
''సాధారణంగా మగ కోయిల కూస్తుంది. దాని పాట విని ఆడకోయిల వస్తుంది. మగ కోయిలలంత సహజంగా అతడు అరవగలిగాడు కనుకనే ఆడకోయిల వచ్చింది. అలాగే నెమలికూడా? అంటే... అతను చేసిన 'ధ్వన్యనుకరణ' ఎంత సహజంగా ఉందంటే ఆ జంతువులు కూడా అతని అరుపులు విని మోస పోయాయి. హాట్స్‌ ఆఫ్‌ టు హిజ్‌ మిమిక్రీ ఆర్ట్‌! అతనే నిజమైన కళాకారుడు. అతన్ని సన్మానించక పోతే ఈ సభకు అర్థమూ లేదు.. మిమిక్రీ కళకు పరమార్థమూ లేదు. కనుక మీరు నన్ను సన్మానిస్తే... అతన్ని నేను సన్మానిస్తాను! ఎల్లమందా! వేదిక మీదకు రా!'' అంటూ మాధవ్‌ అభ్యర్థించాడు.
అతను వచ్చేటట్లు కనిపించలేదు.
మాధవ్‌ కృతనిశ్చయంగా అన్నాడు... నావైపు చూచి... ''నేను ఎల్లమందను సన్మానించాలి! మాస్టారూ! ప్లీజ్‌..మీరే అతన్ని వేదిక వద్దకు తీసుకురావాలి?'' అంటూ అభ్యర్థించాడు.
నేను అతన్ని తీసుకువచ్చేందుకు వేదిక దిగడం ప్రారంభించడంతో ఏమనుకున్నాడో ఎల్లమందే మెల్లగా స్టేజీ వైపు రావడం ప్రారంభించాడు.
ఇంతలో మిమిక్రీ మాధవ్‌ మొదలుపెట్టిన కరతాళ ధ్వనులతో బాటు సభలోని వారి చప్పట్లు కూడా లయగా మ్రోగడం ప్రారంభించాయి.

No comments:

Post a Comment